ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరింపులకు గురిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు ఆరోపించారు. కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో మెజారిటీ వారికి వ్యతిరేకంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించి కాంగ్రెస్‌లో చేరవలసి వచ్చింది. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విద్యాసంస్థలు, రియల్ ఎస్టేట్ లేదా ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారిని భయపెట్టేందుకు సంబంధిత శాఖలను ఉపయోగించి బెదిరించారని ఆయన పేర్కొన్నారు. ఇద్దరు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని, కాంగ్రెస్‌లో…
ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ప్రేమ వ్యవహారం వెలుగు చూసింది. ఇక్కడ ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి తల్లిగారింటికి వచ్చి.. అత్తమామల ఇంటికి వెళ్లకుండా, తమ పిల్లలను తీసుకుని ఎక్కడికో వెళ్లిపోయారు. ఇప్పుడు వారిద్దరూ మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. తమ లవర్స్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిద్దరూ తిరిగి రావడానికి నిరాకరించారు.
రైతు రుణమాఫీకి 6 పేజీల నియమ నిబంధనలు రైతుల పాలిట ఉరితాళ్ళు అని మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలు, నేతలు… ప్రజలను మోసం చేయాలని ఎదురుచూస్తారని రేవంత్ గతంలో చెప్పిన మాటల వీడియోను చూపిన ఈటల రాజేందర్.. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు అవలోకనం చేసుకోవాలన్నారు. ధర్మం తాత్కాలికంగా ఓడిపోవచ్చు అని ఆయన వ్యాఖ్యానించారు. మాట తప్పిన వాళ్ళను…
ధాన్యం సేకరణ విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడ్డారని మంత్రి పార్థసారథి వెల్లడించారు. గత రబీ సీజన్లో సేకరించిన ధాన్యానికి రూ. 1600 కోట్లు బకాయిలు ఉన్నాయని.. వీటిల్లో రూ. 1000 కోట్లు రిలీజ్ చేశామని చెప్పారు. మంత్రివర్గ సమావేశంలో చర్చించిన అంశాలను మంత్రి పేర్కొన్నారు.
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ చౌక ప్లాన్లను అందించేందుకు వెనుకడుగు వేయడం లేదు. ఇతర టెలికాం కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అనేక ప్రత్యేక ప్రణాళికలను బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు అందిస్తోంది. ఈ నెల ప్రారంభంలో జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ప్రతి టెలికాం కంపెనీ రీఛార్జ్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే.. దీంతో.. కస్టమర్లు బీఎస్ఎన్ఎల్ (BSNL) వైపు మళ్లుతున్నారు. దీంతో.. కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ కొత్త ప్లాన్లను అందిస్తోంది.
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ విద్యుత్ కమిషన్ చైర్మన్ పై వాఖ్యలను స్వాగతిస్తున్నామన్నారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. విచారణ కాకముందే ప్రెస్స్ మీట్ లు పెట్టీ చెప్పటం తప్పు అని చెప్పిందని ఆయన ప్రశాంత్ రెడ్డి అన్నారు. రిటైర్డ్ జడ్జి స్థాయిలో కమిషన్ వివరాలు చెప్పటం, పైన తీవ్రంగా తప్పుబట్టడం, ఛైర్మెన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని చెప్పటం అంటే ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ లాగానే…
తాము చెప్పినట్లుగానే అన్ని పనులూ చేస్తున్నామని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై మంత్రి స్పందించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అంశంపై అధ్యయనం చేస్తామని.. ఇతర రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు తీరును పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో 64 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. వీరి సంఖ్యను కోటికి పెంచి.. వారందరినీ కోటీశ్వరులుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 340 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో 140 కోట్లు మొత్తంగా 480…