శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ జెన్కో ప్రారంభించింది. ఉదయం ఏపీ జెన్కో కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించగానే తెలంగాణ ఎడమగట్టు జల విద్యుత్ ఉత్పత్తిని అధికారులు ప్రారంభించారు.
పంట రుణాల మాఫీకి రైతులకు రేషన్ కార్డు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన మరుసటి రోజు, రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేయడానికి భూ పాస్‌బుక్ ఉపయోగించబడుతుంది అని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. రైతులకు పథకం. సచివాలయంలో కలెక్టర్లతో సమావేశమైన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రైతు కుటుంబాన్ని గుర్తించేందుకు మాత్రమే రేషన్ కార్డు ఉపయోగించబడుతుంది. చాలా మందికి రేషన్‌కార్డులు లేకపోవడంతో రేషన్‌కార్డును తప్పనిసరి చేస్తే చాలా…
అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం పోలి గ్రామంలో నిమ్మచెట్ల నరికివేతను సీఎం చంద్రబాబు నాయుడు ఖండించారు. మంజుల అనే మహిళా రైతుకు చెందిన నిమ్మచెట్ల నరికివేతపై నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రోటోకాల్ గురించి కేటీఆర్.. హరీష్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలన ముందు కేటీఆర్.. హరీష్ ల అనుభవం చాలా చిన్నది.. వాళ్ల వయస్సు చిన్నదని, ఎంపీ గా రేవంత్ ఉన్నప్పుడు ఆయన నియోజక వర్గంలో ప్రోటోకాల్ పాటించారా కేటీఆర్.. హరీష్ ఎప్పుడైనా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు ప్రోటోకాల్ పాటించకుండా.. ఇప్పుడు సిఎం రేవంత్ నీ ప్రోటోకాల్ గురించి అడగడంలో అర్థం లేదని, సంగారెడ్డి లో…
Sati: భర్త మరణించిన తర్వాత కనిపించకుండా పోయిన మహిళ ‘సతీ సహగమనం’ చేసిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ జిల్లా రాయగఢ్‌లో చోటు చేసుకుంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరారు. వెలగపూడి నుండి హెలికాప్టర్లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి.. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయల్దేరారు. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను సీఎం చంద్రబాబు కలవనున్నారు.
మొన్న ఎలుక.. నేడు పిల్లి.. జేఎన్టీయూహెచ్ హాస్టల్లో.. రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ ఇంజనీరింగ్ కాలేజ్ క్యాంపస్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చిన సంగతి అందరికీ వివిధమే. హాస్టల్ మెస్ లో ఉన్న చెట్ని పాత్రలో బతికున్న ఎలుక అటు ఇటు కదులుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం గమనించి ఉంటాము. అయితే ఈ సంఘటన మరవకముందే జేఎన్టీయూహెచ్ (JNTUH ) లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నిర్వాహకుల…
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నంద్యాల జిల్లా ముచ్చుమర్రి మైనర్ బాలిక కేసులో తాజా వివరాలను ఎస్పీ అధిరాజ్ సింగ్ రానా మీడియాకు వెల్లడించారు. కేసు ఇంకా విచారణ దశలో ఉందని.. బాలిక మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉందని ఆయన చెప్పారు. ముచ్చుమర్రిలో 7వ తేదీన బాలిక మిస్ అయిందని.. ఫిర్యాదు అందిన వెంటనే బాలిక కోసం వెతికామని ఆయన తెలిపారు.
వైద్యారోగ్య శాఖలో జరుగుతున్న సాధారణ బదిలీలపై తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల సంఘం తీవ్ర అసంతృప్తికి లోనైంది. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యుల బదిలీల ప్రక్రియలో నెలకొన్న సందిగ్ధతపై పెద్ద సంఖ్యలో వైద్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం, ప్రభుత్వ వైద్యులకు, ప్రత్యేకించి దశాబ్దాలుగా పరిధీయ ప్రాంతాల్లో (పట్టణ కేంద్రాలకు దూరంగా) తమ విధులను నిర్వర్తిస్తున్న వారికి, పట్టణ కేంద్రాల్లోని వారితో సమానంగా చికిత్స అందేలా సరైన మార్గదర్శకాలు లేవు. ఈ ఇబ్బందులను పరిష్కరించడానికి , బదిలీ…