కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం… చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. రుణమాఫీపై కేటీఆర్, బండి సంజయ్ అబద్దాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక లక్ష కూడా మాఫీ చేయలేదని.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని పట్టించుకోలేదని మంత్రి మండిపడ్డారు.
Read Also: Stock market: మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్! భారీగా పతనమైన స్టాక్ మార్కెట్
ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల అప్పులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.170 కోట్లతో నిర్మించే ఫామాయిల్ కంపెనీలో 250 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యాక్టరీలో ఎంప్లాయిమెంట్ కల్పిస్తూ నేరుగా 500 మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామన్నారు. ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ పెట్టే యాజమాన్యానికి రైస్ బ్రాండ్ ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని తెలిపారు. 100 కోట్ల రూపాయలతో ప్రతిరోజు 350 టన్నుల ఉత్పత్తికి 120 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని కంపెనీ యాజమాన్యం హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. రైస్ బ్రాండ్ ఆయిల్ నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీ యాజమాన్యానికి ప్రాంత రైతుల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాక రిజర్వాయర్ ఏర్పాటుకు సర్వే కొనసాగుతుందని ఆయన తెలియజేశారు.
Read Also: Parliament Session: బడ్జెట్ సమావేశాల్లో 6 కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం.. వివరాలు..