విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు.
డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయికి బదులు అమ్మాయి ఫొటో.. అప్లై ఎలా చేశారో..! తెలంగాణలో డీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ పరీక్షల షెడ్యూల్ను ప్రకటించింది. హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. డీఎస్సీ హాల్ టికెట్లను https://tsdsc.aptonline.in/tsdsc/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 29న ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు బాగానే వున్నా…
తమ అనుమతి లేకుండా జీపీఎస్ జీవో, గెజిట్ విడుదలపై ఏపీ సీఎంవో సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ విషయంపై విచారణ చేపడుతోంది. ఆర్థిక శాఖ, న్యాయ శాఖల్లో పని చేసే వాళ్లల్లో ఎవరు దీనికి కారకులనే దానిపై సీఎంవో ఆరా తీస్తోంది.
ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ రైతులకు రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా కేసీఆర్ రూ.28 వేల కోట్లు కూడా రైతు రుణమాఫీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలాశాసనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారని,…
ఈరోజు NDSA చైర్మన్, అధికారులతో మాట్లాడినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 20న ఢిల్లీలో NDSA కమిటీతో సమావేశం ఉంటుందని, వర్షాల నేపథ్యంలో డ్యామ్ ల వద్ద తీసుకోవాల్సిన చర్యల పై చర్చించామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ ఉన్నతాధికారులతో సమీక్ష చేశామని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 28 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపులు చేశామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. 18 వేల కోట్లు గత ప్రభుత్వ అప్పుల ఇంట్రెస్ట్…
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ కలిశారు. ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి జేపీ నడ్డాతో చర్చ జరిగిందని ఆయన భేటీ అనంతరం మీడియాతో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సంసిద్ధత గురించి చర్చించామన్నారు.
ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని…
విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. అనకాపల్లిలోని రాంబిల్లిలో ప్రేమపేరుతో బాలికను చిత్రవధ చేసి హత్య చేసి తానూ బలవన్మరణానికి పాల్పడిన ఘటనను మరువక ముందే.. ఉమ్మడి జిల్లాలో మరో దారుణ ఘటన జరిగింది. విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి కత్తిదూశాడు.
ఈనెల 18న రైతులకు రుణమాఫీ చేస్తున్నామన్నారు తుమ్మల నాగేశ్వరరావు. అన్ని మండల కేంద్రాల్లో ఉన్న రైతు వేదిక వద్ద సంబరాలు జరుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హోదాలో రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయబోతున్నారని, లక్ష రూపాయలు ఒకసారి… ఆగస్టులో మిగతా రుణమాఫీ చేయాలని ప్రభుత్వ నిర్ణయమన్నారు తుమ్మల నాగేశ్వరరావు. కుటుంబ నిర్దారణ కోసమే రేషన్ కార్డు అడిగామని, గత రెండు సార్లు చేసినట్లుగానే రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి తుమ్మల. అంతేకాకుండా.. పాత…