కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తాం... చేసి చూపెడతామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల బృందం పర్యటిస్తోంది. అందులో భాగంగా.. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రుణమాఫీతో ప్రతిపక్ష నాయకుల నోళ్ళు మూతపడ్డాయని పేర్కొన్నారు. 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేసే బాధ్యత తమదని అన్నారు. 7 నెలల నుంచి ప్రతిపక్షాలు ప్రతి పనికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఫ్రీ బస్సు, ఆరోగ్య శ్రీని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను హీరో సుమన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదని.. రేపు ఓ కార్యక్రమం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నామన్నారు.
Mallu Bhatti Vikramarka: ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు.. మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించనున్నారు.
ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన 38 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని ఖమ్మం యెల్లందు పట్టణానికి చెందిన బిందె పవన్ కళ్యాణ్గా గుర్తించారు. ఫిబ్రవరి 8, 2024న హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు బయటపడింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, అతనికి లాభదాయకమైన ఆన్లైన్ డేటా ఎంట్రీ ఉద్యోగాన్ని అందజేస్తూ కాల్ వచ్చింది. ఆఫర్ నిజమైనదని నమ్మి,…
ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ట్రంప్‌పై జరిగిన ఈ దాడిలో తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. ఈ దాడి తర్వాత ప్రపంచమంతా ఈ విషయంపై చర్చించింది. ఇదిలా ఉండగా.. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని కొంత మంది పిల్లలు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన తీరును తమ నటన ద్వారా వీడియో రూపంలో చిత్రీకరించారు.
టైప్‌రైటర్లకు సంబంధించిన అధికారిక పరీక్షలను నిలిపివేయాలని రాష్ట్ర సాంకేతిక విద్యా , శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. సాంప్రదాయ టైప్‌రైటర్ , కంప్యూటర్ ఆధారిత మోడ్లలో సంవత్సరానికి రెండుసార్లు పరీక్ష జరుగుతుంది, మొదటి షెడ్యూల్ జూలైలో , రెండవది డిసెంబర్లో జరుగుతుంది. ఏటా దాదాపు 4,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతారు. టైప్‌రైటర్‌ను ఉపయోగించాలని ఎంచుకునే అభ్యర్థులు తప్పనిసరిగా తమ యంత్రాన్ని పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలి, కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఎంచుకునే వారు…
శుక్రవారం నుంచి 3 రోజుల పాటు శాకాంబరి దేవిగా కనకదుర్గమ్మ దర్శనం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు ఎల్లుండి(శుక్రవారం) నుంచి మూడు రోజులపాటు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వివిధ కూరగాయలు, ఆకులు, ఆకు కూరలతో అర్చకులు, అధికారులు అమ్మవారిని అలంకరించనున్నారు. కూరగాయలతో అలంకారంలో కనకదుర్గమ్మ కనిపించనున్నారు. కనకదుర్గమ్మ ఆలయం మొత్తాన్ని కూరగాయలతో అలంకరించనున్నారు. వారాంతపు సెలవులు ఉండే సమయం కావడంతో భక్తుల రద్దీకై ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేడు ఆషాఢ మాసం…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను రేపటి(ఈ నెల 18) నుంచి విడుదల చేయనుంది. రేపటి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.