తెలంగాణలో రైతులకు రుణమాఫీ అవుతున్న సంగతి తెలిసిందే.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులైన రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయనుంది. మొదటగా లక్ష లోపు ఉన్నవారికి రుణమాఫీ అయింది. ఈ క్రమంలో.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన మొదట్లోనే 31 వేలకోట్ల రుణమాఫీ చేయడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం అని అన్నారు. ఏదైనా సాంకేతిక సమస్య ఉంటే రైతు వేదికల వద్ద ఏఓ ఉంటారు.. సమస్యను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. రాజకీయ పార్టీల ఆత్రుతతో రైతులను ప్రక్కదోవ పట్టిస్తున్నారని మంత్రి ఆరోపించారు.
Read Also: Cinema Cess: సినీ టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లపై మోత?
మీడియాలో తప్పుడు వార్తలొస్తున్నాయి. కానీ నిజ నిజాలను తెలుసుకొని ప్రసారాలు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. రైతులను ఆగం చేయకుండా, అయోమయానికి గురి చేయొద్దని సూచించారు. రుణమాఫీకి అర్హులైన ప్రతి రైతుకు న్యాయం జరుగుతుంది.. ఏ ఒక్క రైతుకు అన్యాయం కానివ్వం అని అన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళన చెందొద్దు.. ఇంత మంచి కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలి, కానీ బురదజల్లే కార్యక్రమం చేయొద్దని సూచించారు. రైతుబందుకు మూటకట్టి పెట్టలేదు గత ప్రభుత్వం.. చెల్లించకుండా ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక చెల్లించామని తెలిపారు. అలాగే.. రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. రైతులు నమ్మకంగా ఉండండి.. గత ప్రభుత్వం చేసిన మోసం వల్ల తమపై అపనమ్మకం పెట్టుకోవద్దు రైతులకు విజ్ఞప్తి చేశారు. రెండు లక్షల రుణమాఫీ అర్హులైన ప్రతి రైతుకు చేస్తామని తెలిపారు. ఇంకా నాలుగున్నర సంవత్సరాలు అధికారంలో ఉంటాము.. చేయకపోతే నిలదీయండని మంత్రి చెప్పారు.
Read Also: School Bus: హైదరాబాద్లో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. అదుపుతప్పి చెట్ల పొదల్లోకి