బీఆర్ఎస్పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర గవర్నర్ను కలవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా..? అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అప్పటి గవర్నర్ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని తెలిపారు. అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ఆశ్రయించడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలంటున్నారు.. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది మీరు కాదా..? అని బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. రాజ్యాంగానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా నియంతృత్వ పాలన చేసింది మీరు కాదా.. తెలంగాణలో రాజ్యాంగాన్ని ఖననం చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా..? అని ప్రశ్నించారు.
Sonu Sood: ‘‘సొంత రామాయణం’’.. రోటీలపై ఉమ్మేస్తున్న వ్యక్తిని రాముడు-శబరితో పోల్చడంపై కంగనా ఫైర్..
ఫిరాయింపులకు పాల్పడుతున్నారని రాజ్ భవన్ ముందు కేటీఆర్ గొంతు చించుకుంటున్నారని బీర్ల ఐలయ్య విమర్శించారు. పదేళ్ల పాటు ఆయన గొంతు ఎందుకు మూగబోయింది.. తెలంగాణలో ప్రతిపక్షాలే లేకుండా కేసీఆర్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కేటీఆర్ మౌనవ్రతం పాటించారా..? అని ప్రశ్నించారు. ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయడానికి కేటీఆర్ కు సిగ్గు ఉందా..? అని ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను మంత్రులుగా అదే రాజ్ భవన్ లో ప్రమాణం చేయించినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా..? ప్రొటొకాల్ గురించి కేటీఆర్ తెగ గింజుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. అధికార మదంతో ఆనాడు విర్రవీగి ఈనాడు రాజ్ భవన్ గేట్ ముందు హాహాకారాలు చేస్తున్నారని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను కనీసం సెక్రటేరియట్లోకి కూడా అనుమతివ్వకుండా అడ్డుకున్న చరిత్ర మీది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Microsoft Effect: ఒక్కరోజులో భారీగా తగ్గిన ఇండిగో షేర్లు..ఇన్ని కోట్ల నష్టమా..!
హైదరాబాద్లో భయానక వాతావరణాన్ని ప్రభుత్వం సృష్టించిందని కేటీఆర్ అంటున్నారు.. అధికారం పోగానే హైదరాబాద్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని బీర్ల ఐలయ్య ఆరోపించారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. నిరుద్యోగుల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేశాం… పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. పదేళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగులను రోడ్ల మీదకు తీసుకువచ్చింది మీరు కాదా..? అని ప్రశ్నించారు. రైతులకు బేడీలు వేసిన చరిత్ర కేసీఆర్ది అని పేర్కొన్నారు. రుణమాఫీతో రైతులంతా సంతోషంగా ఉంటే కల్వకుంట్ల మాత్రం కడుపులో కుట్రలతో రగిలిపోతుందని అన్నారు. గవర్నర్ దగ్గరకు పోయినా.. రాష్ట్రపతి దగ్గరికి పోయినా.. బీఆర్ఎస్ నాయకుల తప్పుడు ప్రచారానికి స్పందన ఉండదని తెలిపారు. తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీయడానికి కల్వకుంట్ల చేస్తున్న కుట్రలు ఫలించవు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనవసర ఆరోపణలు చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని వ్యాఖ్యానించారు.