Heavy Rains: భారీ వర్షాల ఎఫెక్ట్.. అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు
- అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు
- రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అల్లూరి ఏజెన్సీ ఘాట్‌లలో వాహన రాకపోకలపై ఆంక్షలు విధించారు. నేడు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ఘాట్‌లలో చెట్లు, కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉండటంతో అధికారులు చర్యలు చేపట్టారు. పాడేరు, చింతపల్లి, అరకు, రంపచోడవరం, చింతూరు, ఎస్ కోట ఘాట్ రోడ్‌లో ప్రయాణంపై నిషేధం విధించారు.
Read Also: Rammohan Naidu: రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కేంద్రం సాయం అవసరం.. నిధులను ఏపీకి రప్పిస్తాం..
Also Read
ఆలయ గోపురాన్ని తాకిన వరద నీరు
ఇదిలా ఉండగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని దేవీపట్నంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం గండి పోచమ్మ ఆలయం గోపురం వరకు గోదావరి వరద నీరు పోటెత్తింది. ఇప్పటికే దర్శనాలను అధికారులు నిలిపివేశారు. గుడి ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్స్యకారులకు గోదావరిలోకి చేపల వేటకు వెళ్లవద్దని వేటగాళ్లకు అధికారులు హెచ్చరించారు. పోచమ్మ గుడి ఆవరణలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!