Simhachalam: సింహాచలం గిరి ప్రదక్షిణను శాస్త్రోక్తంగా ప్రారంభించిన దేవస్థానం
- సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభం
- ఆధ్యాత్మిక యాత్ర కోసం లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Simhachalam: విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో గిరి ప్రదక్షిణ మహోత్సవం వైభవోపేతంగా ప్రారంభమైంది. సింహాచలం గిరి ప్రదక్షిణను దేవస్థానం శాస్త్రోక్తం ప్రారంభించింది. వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి పూల రథాన్ని జెండా ఊపి ఆలయ అనువంశిక ధర్మకర్త, చైర్మన్ అశోక్ గజపతి రాజు ప్రారంభించారు. ఏటా ఆషాఢ పౌర్ణమి రోజు సింహాద్రి అప్పన్న కొండ చుట్టూ 32కి.మీ ప్రదక్షిణ చెయ్యడం భక్తులకు ఆనవాయితీగా వస్తోంది. ఏటా ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని చతుర్దశినాడు లక్షలాది భక్తులు సింహాచలం పుణ్యక్షేత్రానికి తరలివస్తారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం కొండ దిగువన తొలి పావంచా వద్ద నుంచి అప్పన్నస్వామి పుష్పరథం గిరి ప్రదక్షిణకు బయలుదేరుతుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది ఆధ్యాత్మిక యాత్ర కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు. ఈ యాత్ర కోసం ఐదుగురు ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు 2,600 మంది పోలీసు సిబ్బంది.
భారీగా భక్తులు తరలివస్తుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశామని సిటీ పోలీస్ కమిషనర్ ఎస్.బాగ్చీ తెలిపారు. 32కి.మీ గిరిప్రదక్షిణ పూర్తయ్యే సరికి రేపు మధ్యాహ్నం 11 అవ్వొచ్చని.. అప్పటి వరకు గిరిప్రదక్షిణ జరిగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అప్పుఘర్ దగ్గర భక్తులు పుణ్య స్నానాలు చేసి తిరిగి యాత్ర ప్రారంభిస్తారని చెప్పారు. బీచ్ దగ్గర ఎటువంటి ప్రమాదాలు జరగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేశామన్నారు. శ్రీకాకుళం ఎస్పీకి అక్కడ బాధ్యతలు అప్పగించామన్నారు.
Also Read
- GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
- Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
Read Also: TDP: టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఏపీకి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై చర్చ
మరోవైపు.. గిరిప్రదక్షిణ కారణంగా ఈ రోజు, రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.. వివిధ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ మళ్లింపులు ఉన్నాయని.. భక్తులు, ప్రజలు గమనించాలని సూచించారు అధికారులు.. నగరం మీదుగా ఇతర జిల్లాలకు వెళ్లే వాహనాలను కూడా దారి మళ్లించినట్టు పేర్కొన్నారు.. అయితే, సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ నుంచి అడవివరం, ధారపాలెం, ఆరిలోవ, హనుమంతువాక పోలీసు క్వార్టర్స్, కైలాసగిరి టోల్ గేట్, అప్పుఘర్ జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్, వెంకోజీపాలెం, హెచ్‌బీ కాలనీ, కైలాసపురం, మాధవధార, మురళీ నగర్, బుచ్చిరాజు పాలెం, లక్ష్మీ నగర్, ఇందిరా నగర్, ప్రహ్లాదపురం, గోశాల జంక్షన్, లి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేసుకోవాల్సి ఉంటుంది.. మొత్తంగా గిరిప్రదక్షణ 32 కిలో మీటర్ల మేర సాగుతుంది.. కాగా, ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. ఇక, గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈ రోజు, రేపు ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. జులై 20న ఉదయం గిరి ప్రదక్షిణ ప్రారంభించి, రాత్రికే తిరిగి సింహాచలం చేరుకునే భక్తుల సౌకర్యార్థం.. రాత్రి 10 గంటలకు వరకు దర్శనాలకు అనుమతించనున్నారు.
తాజావార్తలు
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!