భారత్-శ్రీలంక మధ్య కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక 240 పరుగులు చేసింది. భారత్ ముందు 241 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో అవిష్క ఫెర్నాండో (40), కామింధు మెండీస్ (40), దునిత్ వెల్లలాగే (39), కుశాల్ మెండీస్ (30) పర్వాలేదనిపించారు.
Read Also: Arunachal Pradesh Trip: అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలనుకుంటున్నారా?..ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ ట్రై చేయండి
శ్రీలంక బ్యాటింగ్లో ఓపెనర్ నిస్సాంకా మొదటి బంతికే డకౌట్ అయ్యాడు. సమరవిక్రమ (14), జనిత్ లియాంగే (12), అఖిల ధనుంజయ (15) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 కీలక వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, సిరాజ్కు చెరో వికెట్ దక్కింది. కాగా.. మొదటి వన్డేలో శ్రీలంక 230 పరుగులు చేస్తే.. లక్ష్య చేధనలో భారత్ కూడా 230 పరుగులు చేసింది. దీంతో.. మ్యాచ్ టైగా ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్లో నిలకడగా ఆడి భారత్ విజయం సాధించాలని చూస్తోంది.
Dowry harassment: ఆఫ్రికా వ్యక్తితో పడుకోవాలని భార్యపై ఒత్తిడి.. కట్నం కోసం భర్త దురాగతం..