విహారయాత్ర కాస్తా విషాదంగా మారింది. విహారయాత్రకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని వెళ్లిన యువకులు శవాలుగా తిరిగొచ్చారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ మధ్యనే శ్రీశైలం జలాశయం గేట్లు అధికారులు తెరిసిన విషయం తెలిసిందే.. అది చూసేందుకు ఎక్కడెక్కడో పర్యాటకులు తరలివస్తున్నారు. గత నాలుగురోజులుగా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఇదే క్రమంలో.. తాము కూడా ఆ అందాలను చూసేందుకని వెళ్లారు. కానీ.. మళ్లీ తిరగ రాలేదు. ఈరోజు ఆదివారం కావడంతో పర్యాటకుల సందర్శన మరింత ఎక్కువైంది. దీంతో.. ఎక్కడికక్కడా ట్రాఫిక్ నిలిచిపోయింది.
Read Also: Love Jihad: “లవ్ జిహాద్”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..
ఇదిలా ఉంటే.. శ్రీశైలం వెళ్లడం వరకైతే బాగానే వెళ్లారు. అక్కడ కృష్ణమ్మ పరవళ్లు చూసి ఎంజాయ్ చేసిన స్నేహితులు, తిరిగి పయనమయ్యారు. అయితే.. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూరు సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టుకు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో మచ్చ బొల్లారంకి చెందిన కన్నయ్య (22) ఉన్నాడు. మరో ఇద్దరు కొంపల్లికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కన్నయ్య అనే వ్యక్తి కారులోనే విహారయాత్రకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Mossad: మొసాద్ డెడ్లీ ఆపరేషన్స్.. మ్యూనిచ్ ఊచకోతకు కారణమైన ప్రతీ ఉగ్రవాదిని వెంటాడి లేపేసింది..