Komatireddy Venkat Reddy: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల పరిశీలన.. కొత్త టెండర్ల ఏర్పాటుకు ఆదేశం
- ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులను పరిశీలించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఎంపీ ఈటల రాజేందర్
- 2018 నుండి నేటి వరకు పూర్తికాని ఉప్పల్- ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పనులు
- పనులు పూర్తిగా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.. స్థానిక ప్రజలు
- గత కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య సమన్వయ లోపంతో నిలిచిపోయిన పనులు
- కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయాలని నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉప్పల్-నారపల్లి నిలిచిపోయిన నూతన ఫ్లై ఓవర్ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి పరిశీలించారు. 2018లో ప్రారంభమై నేటికి ఫ్లై ఓవర్ పనులు పూర్తికాలేదు. ఐదేళ్ళైనా ఫ్లై ఓవర్ పూర్తి కాకపోవడం కారణాలపై నేషనల్ హైవే అధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షించారు. పనులు పూర్తి కాకపోవడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య సమన్వయ లోపంతో పనులు నిలిచిపోయాయి. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఫ్లై ఓవర్ పనులు పూర్తిచేయాలని నిర్ణయం తీసుకుంది. ఇటీవలే కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. 2018లో 600 కోట్లతో ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ప్రారంభించారు. నిధుల లేమితో నిలిచిపోయిన 7.2 కిలోమీటర్ల పొడవు ఉన్న ఫ్లైఓవర్..
Bangladesh clashes: బంగ్లాదేశ్ ఘర్షణల్లో 32 మంది మృతి.. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ..
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
ఈ సందర్భంగావారం రోజుల్లో కొత్త టెండర్లకు ఏర్పాటు చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. 2018 నుండి నేటి వరకు పనులు పూర్తి కాకపోవడం గత రాష్ట్ర ప్రభుత్వానికి అవమానకరం అని అన్నారు. మూసీ తర్వాత అత్యంత ప్రధానమైనటువంటి ఈ హైవేలో ఫ్లైఓవర్ పూర్తిగాకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. వర్షాకాలంలో గుంతలో పడి అనేక మందికి యాక్సిడెంట్లు అవుతున్నాయని.. వెంటనే ఆర్&బీ అధికారులతో కలిసి రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి, తనకు ఎస్టిమేషన్ నివేదిక అందజేయాలని మంత్రి ఆదేశం ఇచ్చారు. ఆరు సంవత్సరాల నుంచి పనులు పూర్తికాకపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు.
IND vs SL: రెండో వన్డేలో భారత్ టార్గెట్ ఎంతంటే..?
అధికారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. 15 రోజులలో కల్వర్టు పనులు పూర్తి చేయాలి.. అధికారుల నిర్లక్ష్యం తోటి ప్లై ఓవర్ పూర్తి కాలేదని మంత్రి తెలిపారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకోవద్దు.. వారి తప్పిదం వల్ల ప్రజలకు నష్టం జరుగొద్దని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లు పూర్తి చేయకపోతే ఇన్ని సంవత్సరాలు నుంచి ఎందుకు టెర్మినేట్ చేయలేదని ప్రశ్నించారు. వేరే వాళ్లకు ఎందుకు అప్పగించలేదు.. జీహెచ్ఎంసీ, ఫారెస్ట్ అని తప్పించుకోవద్దని అన్నారు. ఈ క్రమంలో.. ఏడో తారీఖు నుండి పనులు ప్రారంభిస్తామని నేషనల్ హైవే ఆర్వో పుష్ప చెప్పారు.
తాజావార్తలు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..