Sexual Harassment: మైనర్ బాలికపై అత్యాచారం.. వీడియో రికార్డు
- ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం
- బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు
- ఈ ఘటన మొత్తం వీడియో తీసిన నిందితుడి స్నేహితులు
- అత్యాచార ఘటనలో ఇద్దరు నిందితులు అరెస్ట్
- మరొకరి కోసం గాలింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. బాలికను ఓ హోటల్ కు తీసుకెళ్లి నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా.. ఈ ఘటన మొత్తం నిందితుడి స్నేహితులు వీడియో తీశారు. వీడియో తీసిన అనంతరం బాలికను బెదిరించి తన వద్ద నుంచి డబ్బు, ఉంగరం తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మూడో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
వివరాల్లోకి వెళ్తే.. షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ హోటల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతుంది. ఆరు నెలల క్రితం సందీప్ అనే యువకుడితో బాలికకు పరిచయమైంది. ఈ క్రమంలో.. సందీప్ బాలిక మొబైల్ నంబర్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాల్ చేయడం ప్రారంభించాడు. అయితే.. కలవడానికి బాలిక నిరాకరించడంతో ఫోన్లో బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో నిందితుడు హద్దులు మీరాడు. కాగా.. జూలై 17వ తేదీ మధ్యాహ్నం సందీప్ తన స్నేహితుడితో కలిసి బాలిక గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ కలిసి బాలికను బలవంతంగా బైక్‌పై తీసుకెళ్లి పథౌలీలోని ఓ హోటల్‌లో బాలికపై సందీప్ అత్యాచారం చేశాడు.
అంతేకాదు మొబైల్‌లో అభ్యంతరకర వీడియోను రికార్డ్ చేశారు. నిందితుడి సహచరులు సాజన్, బాబీ ఉంగరంతో పాటు రూ.15 వేలు తీసుకున్నారు. అనంతరం.. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులు సందీప్, సాజన్‌లను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు బాబీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజ్ రాజేశ్వరి హోటల్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హోటల్ లో రికార్డులు తనిఖీ చేసి.. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!