Collectors Conference: 11 గంటల పాటు సాగిన కలెక్టర్ల సదస్సు.. అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం
- ముగిసిన కలెక్టర్ల కాన్ఫరెన్స్
- 11 గంటల పాటు సాగిన సమావేశం
- కలెక్టర్లకు..ఎస్పీలకు చంద్రబాబు దిశా నిర్దేశం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collectors Conference: వెలగపూడిలోని సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘంగా కొనసాగింది. 11 గంటల పాటు సమావేశం సాగింది. కలెక్టర్లు, ఎస్పీలకు చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అసమర్థ ప్రభుత్వం అనిపించుకోవడానికి తాను సిద్ధంగా లేనన్నారు. క్రైమ్ కంట్రోల్ చేయడానికి సీసీ కెమెరాలను.. డ్రోన్లను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించుకుని నేరస్తులను పట్టుకునే వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. గత ప్రభుత్వం ఈ టెక్నాలజీని వినియోగించుకోలేదన్నారు. కేసులు పెట్టడానికి.. వేధించడానికి గత ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను వాడుకుందని ఆయన విమర్శించారు. నిన్న ఒక్క రోజే 5 వేల అర్జీలు వచ్చాయి.. వచ్చిన వాటిల్లో 50 శాతం భూ సమస్యల పైనే వచ్చాయన్నారు. భూ సమస్యల విషయంలో ప్రజల్లో చాలా అన్‌రెస్ట్ ఉందన్నారు.
Read Also: Amaravathi: రెవెన్యూ శాఖపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
Also Read
- Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
- AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
- US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మదనపల్లె ఫైల్స్ ఘటన ఓ కేస్ స్టడీ అని.. మదనపల్లె ఘటన జరిగితే హెలికాప్టర్ ఇచ్చి డీజీని.. సీఐడీ చీఫ్‌ను పంపానని సీఎం చెప్పారు. 22-A పేరుతో భూ సమస్యలు సృష్టించారని ఆయన మండిపడ్డారు. కంప్యూటర్‌లో చిన్నపాటి మార్పు చేసి.. భూములను కాజేశారని అన్నారు. భూమి ఉంటే సామాన్యునికి ఓ భరోసా అని .. దాన్ని కబ్జా చేయడంతో ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. భూములను ఫ్రీ హోల్డ్ చేసి.. రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని సీఎం తెలిపారు. భూ బాగోతాలను ఎస్టాబ్లిష్ చేయాలి.. పేదలకు న్యాయం చేయాలన్నారు. నేరాలను చేయడం.. వాటిని కప్పి పుచ్చుకోవడం కొందరికి అలవాటుగా మారిందని ఆగ్రహించారు. తప్పుడు ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంటున్నానని చంద్రబాబు హెచ్చరించారు. ఐదేళ్లల్లో చేసిన తప్పును వెలికి తీసి శిక్షిస్తాం.. ఇప్పుడు ఎవరు తప్పులు చేసినా ఊరుకోనని సీఎం ఖరాకండిగా చెప్పారు. గంజాయి సేవించి ఆడవాళ్ల మీద దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు గత ఐదేళ్ల కాలంలో చాలా ఇబ్బందులు పడ్డారు.. వాళ్లకు ప్రశాంత జీవితం ఇవ్వాలన్నారు.
Read Also: AP CM Chandrababu: పుట్టపర్తి సత్య సాయి ట్రస్ట్ విషయంలో సీఎం కీలక కామెంట్లు
శాంతి భద్రతల నిర్వహణపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. రౌడీయిజం చూశా.. నక్సలిజం చూశా.. ఫ్యాక్షనిజం చూశా.. నాకేం భయం లేదన్నారు. గంజాయి మత్తులో క్షణికావేశంలో నేరాలకు పాల్పడుతున్నారు.. దీన్ని కంట్రోల్ చేయాలని సూచించారు. చిన్న సంఘటననూ నిర్లక్ష్యం చేయొద్దన్నారు. లిక్కర్ పాలసీపై అధ్యయనం చేస్తున్నామని.. అన్ని రకాల లిక్కర్ బ్రాండ్లను ఏపీలోకి అనుమతిస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అన్ని బ్రాండ్లు అందుబాటులోకి వస్తే.. మద్యం అక్రమ రవాణా తగ్గుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక యాప్ తెస్తున్నామని తెలిపారు. ప్రభుత్వంపై దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులు, అధికారులకు సూచించారు.
2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామని.. జిల్లాలకు విజన్ డాక్యుమెంట్ తేవాలన్నారు. రూ. 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయన్న సీఎం చంద్రబాబు.. రూ. 1.17 లక్షల కోట్ల మేర బిల్లులు చెల్లింపులు జరపాలన్నారు. కొంత మేర ఆర్థిక సాయం చేయడానికి కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. సంపద సృష్టించాల్సిన అవసరం ఉందని.. సంపద సృష్టి జరగాలంటే శాంతి భద్రతల నిర్వహణ సరిగా ఉండాలన్నారు. వివిధ అంశాలపై త్వరలో పాలసీలు తెస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. విజిబుల్ పోలీసింగ్.. ఇన్ విజుబుల్ పోలీస్ అనే విధానం ఉండాలన్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!