నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవల బంద్కు జూడాలు పిలుపునిచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా నేడు ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ 14వ తేదీన ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు జూడాలు ప్రకటనలో వెల్లడించారు.
మూడో విడత రుణమాఫీ రేపు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి.
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే బార్బర్ను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు కొందరు దుండగులు. హత్య జరిగిన వెంటనే స్థానికులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.
గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ఆయన సీఎం కార్యాలయ అధికారులను ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు…
“వక్ఫ్ బిల్లు”పై పార్లమెంటరీ కమిటీ చైర్పర్సన్గా జగదాంబికా పాల్ నియామకం.. వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలని’ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వక్ఫ్ సవరణ బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది రాజ్యాంగంపై దాడిగా, మతస్వేచ్ఛని హరిస్తున్నాయంటూ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు ఈ బిల్లుపై ఆందోళన చేశాయి. దీంతో ఈ బిల్లుని చర్చించేందుకు ‘‘ జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)’’ని నియమించింది. 21 మంది అధికార, ప్రతిపక్షకు చెందిన లోక్సభ ఎంపీలను, 10…
హైదరాబాద్కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్ తో పాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మ పై కేసు నమోదు చేసింది సీబీఐ. ఓ వ్యక్తి నుండి జీఎస్టీ అధికారులు లంచం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. ఐరన్ స్క్రాప్ గోదాం లో అక్రమాల పై ఫైన్ విధించిన జీఎస్టీ అధికారులు… బాధితుడు నుండి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇవ్వకపోవడంతో…
ఈనెల 15న సీతారామ ప్రాజెక్టులోని 3 పంపులను ముఖ్యమంత్రి రేవంత్ ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2026 ఆగస్టు 15కు పూర్తి చేయబోతున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను, ఇరిగేషన్ శాఖను నాశనం చేశారని, ఇరిగేషన్ శాఖను గాడిలో పెట్టె ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పదేళ్లలో 1.81లక్షల కోట్లు ఇరిగేషన్ శాఖకు ఖర్చు చేసి నామమాత్రంగా పనులు చేశారని, కాళేశ్వరంకు లక్ష కోట్లు…
హైదరాబాద్లో పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కామాటిపురాలోని ఓ డెకరేషన్ షాపులో మంటలు చెలరెగాయి.. దీంతో.. క్షణాల్లో ఫ్యాక్టరీ మొత్తం మంటలు వ్యాపించాయి. అయితే.. వెంటనే గోదాం సిబ్బంది అగ్ని మాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలో 5 ఫైరింజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎంత శ్రమిస్తున్నప్పటికీ, మంటలు అదుపులోకి రావడం లేదు. కెమికల్ గోదాం కావడంతో డబ్బాలు ఒక్కొక్కటిగా పేలుతున్నాయి. దాంతో, మంటలు మళ్లీ మళ్లీ చెలరేగుతున్నాయి. ఘటన జరిగిన…
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల విద్యార్థినిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేసిన ఉదంతం వెలుగు చూసింది. నలసోపరా ప్రాంతంలో ఓ ప్రైవేట్ ట్యూషన్ క్లాస్లో నిందితుడు ఈ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుడైన స్కూల్ టీచర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని అమిత్ దూబే (30)గా గుర్తించినట్లు తెలిపారు.