PM Narendra Modi: దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు. అప్పుడు ఉన్న 40 కోట్ల మంది దేశానికి స్వతంత్రాన్ని సాధిస్తే.. ఇప్పుడు 140 కోట్ల మంది ఎంత సాధించవచ్చో ఆలోచించాలన్నారు. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను మార్చాలని ఆకాంక్షించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని ప్రధాని మోడీ కోరుకున్నారు. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమని, న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రకృతి విపత్తుల్లో ఇటీవల ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళుర్పించారు. ఎన్డీయే ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం తీసుకున్న చర్యలను ప్రధాని మోడీ తన ప్రసంగంలో వివరించారు.
Read Also: PM Modi: బంగ్లాదేశ్‌లోని హిందువుల భద్రతపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోడీ ఉదయాన్నే రాజ్‌ఘాట్‌కు చేరుకుని జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత ప్రధాని ఎర్రకోటకు చేరుకున్నారు. రాజ్‌ఘాట్‌లోని మ అనంతరం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఎక్కువ సార్లు ఎగురవేసిన మూడో ప్రధానిగా రికార్డు సృష్టించారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ తర్వాత 11 సార్లు జెండా ఎగురవేసిన ప్రధానిగా మోడీ నిలిచారు. కాగా వరుసగా 11 ఏళ్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా ఇప్పటికే మోడీ నిలిచారు.