తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లులేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) ఫలాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి లేఖ రాశారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందన్నారు. పథకం ప్రారంభ సమయంలో…
టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఫిట్స్ వచ్చిన ప్రయాణికుడిని ఆస్పత్రిలో చేర్పించి డ్రైవర్ ఉదారత చాటుకున్నారు. బస్సును నేరుగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. వరంగల్-2 డిపోనకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు హైదరాబాద్ నుంచి హన్మకొండకు సోమవారం వెళ్తోంది. హైదరాబాద్ శివారు ఘట్ కేసర్ దాటగానే సంతోష్ అనే ప్రయాణికుడికి బస్సులో ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. ఈ విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు డ్రైవర్ బి.వెంకన్న దృష్టికి తీసుకెళ్లారు. వెంటేనే బస్సును పక్కకి ఆపి ఫిట్స్ వచ్చిన…
ఇన్స్టాగ్రామ్ యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి . ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యాశాఖపై…
రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తెలంగాణ విద్యావ్యవస్థకు శాపంగా మారిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తాజాగా ప్రకటించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ లో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో నిర్వహించే విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్య సంస్థల పనితీరు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. ఉన్నత విద్యలో మాత్రమే కాదు, ప్రాథమిక విద్యలోనూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు నానాటికి తీసికట్టుగా ఉందని ఇటీవల విడుదల చేసిన ఉమ్మడి…
ఇటీవల ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రైవేట్ పార్టీలపై దాడులు చేయడం, అనుమతి లేకుండా మద్యం అందిస్తున్నారని కేసులు బుక్ చేయడం పౌరులకు మద్యం అందించే పార్టీలకు అనుమతి అవసరమా అనే సందేహాన్ని కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, నివాసాల వద్ద జరిగే ప్రైవేట్ పార్టీలలో భారీ మొత్తంలో మద్యం సరఫరా చేసేందుకు ప్రజలు తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇంట్లో జరిగే పార్టీలకు మద్యం తక్కువ పరిమాణంలో అంటే ఆరు…
శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ఉన్న లింగాలగట్టు వద్ద అధికారులు డ్యాం క్రెస్ట్‌గేట్లను మూసివేసి దిగువకు నీటి విడుదలను నిలిపివేయడంతో మత్స్యకారులు తమ దేశ పడవల్లో చేపల వేటకు పెద్ద సంఖ్యలో వచ్చారు . గత రెండు వారాలుగా శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి భారీగా ఇన్ ఫ్లో రావడంతో డ్యాం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది. అయితే గత రెండ్రోజుల నుంచి ఇన్ ఫ్లో క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అధికారులు డ్యామ్ క్రెస్ట్ గేట్లను మూసివేశారు. ఇన్ని…
మంగళవారం కురిసిన వర్షానికి ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) క్యాంపస్‌లోని రీసెర్చ్ స్కాలర్స్ మెస్ సౌకర్యం మరోసారి నీటితో నిండిపోయింది. నేలపై చీలమండల పొడవు నీరు ఉండటంతో విద్యార్థులు ఇండోర్ పూల్‌లో భోజనం చేయవలసి వచ్చింది. నీటితో నిండిన భోజన సదుపాయానికి సంబంధించిన అనేక వీడియోలను రీసెర్చ్ స్కాలర్లు ప్రసారం చేశారు. అలాంటి ఒక వీడియోలో, రెయిన్‌కోట్‌ను ధరించిన వారిలో ఒకరితో ఉన్న ఇద్దరు విద్యార్థులు నేల నుండి వర్షపు నీటిని మానవీయంగా ఒక గిన్నెలోకి పోసి, సమస్య…
ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు 25వ రోజు వినతులు వెల్లువెత్తాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే “ప్రజాదర్బార్” కు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్.. సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్‌లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి పవన్ వచ్చారు. షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.