రేపు జరగబోయే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశామని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నామని, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు 4 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రే హౌండ్స్, ఆక్టోపస్ టీమ్స్ కూడా బందోబస్తు లో ఉంటారన్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి 11.30 వరకు గోల్కొండ కోటలో ప్రభుత్వం తరఫున అధికారిక వేడుకలు జరుగనున్నాయన్నారు. ఇదిలా ఉంటే.. రూ. కోటి.10 లక్షల రూపాయల విలువచేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని,
ఫుట్బాల్ ప్లేయర్ ఫ్రాంక్ డ్రగ్ పెడ్లర్ గా మారినట్లు ఆయన తెలిపారు. స్పోర్ట్స్ వీసా మీద నైజీరియా నుండి ఇండియాకు ఫ్రాంక్ వచ్చినట్లు, 2018 వరకు ఢిల్లీలోని ఓ క్లబ్ తరఫున ఫుట్‌బాల్ ఆడినట్లు గుర్తించామన్నారు. ఆర్థిక ఇబ్బందులతో డ్రగ్స్ వ్యాపారం లోకి నైజీరియాన్ దిగినట్లు తెలిపారు. నైజీరియన్ ఫ్రాంక్ తో పాటు , డ్రగ్ పేడ్లర్ అనస్ ఖాన్, డ్రగ్ డెలివరీ బాయ్ సైఫ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు.
నగరంలో సెల్ ఫోన్స్ చోరీలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని, సెల్ ఫోన్స్ దొంగతనాలకు పాల్పడుతున్న వారు వారి వద్ద నుంచి చోరీ చేసిన సెల్ ఫోన్లు రిసివ్ చేసుకుంటున్న వారిని గుర్తించామన్నారు. సుమారు గా 25 మందికి పైగా ప్రధాన నిందితులను అరెస్ట్ చేశామని, నగరంలో వరుస చోరీల నేపథ్యంలో డేకాయ్ ఆపరేషన్లు చేస్తున్నామని, సెల్ ఫోన్లు చోరీ చేయడంలో ప్రాణాలు కూడా తీస్తున్నారన్నారు. గతంలో పోల్చుకుంటే సెల్ ఫోన్స్ చోరీల సంఖ్య తగ్గిందని ఆయన తెలిపారు.
వీరి వద్ద నుండి వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని, బెంగళూరులో ఉన్న నైజీరియాల్లో హైదరాబాద్కు డ్రగ్స్ ను తరలిస్తున్నారని, ఇప్పటికే నైటీరియన్ , సుడాన్ దేశాలకు చెందిన నిందితులను డిపోర్టు చేశామని, నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులకు 3 లక్షల రూపాయల రివార్డు ప్రకటిస్తున్నామన్నారు. రాజేంద్రనగర్ లో నివాసం ఉంటున్న డ్రగ్ ఫెడ్లర్ ఆనాస్ ఖాన్ పై నిఘా ఉంచామని, అనాజ్ ఖాన్ తో పాటు నైజీరియాన్ మరొక నిందితుడు రాజేంద్రనగర్లో ఒక చోట కలుస్తున్నారు అని సమాచారం అందిందన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు నార్కెట్ బ్యూరో బృందం బంజారాహిల్స్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించారని, ముగ్గురు డ్రగ్స్ విక్రయతలను అరెస్ట్ చేశారన్నారు.
నిందితుల నుండి కారు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసామని, నిందితుల వద్ద నుండి కోటి పది లక్షల విలువ చేసి ఆరు రకాల డ్రగ్స్ సీజ్ చేసామన్నారు సీపీ శ్రీనివాస్ రెడ్డి. పట్టుబట్ట వారిలో ఒక నైజీరియాలో ఉన్నాడు.. డెలివరీ బాయ్ సైఫ్ ను కూడా అరెస్ట్ చేశామని, డెలివరీ పై సైజు రాజేంద్రనగర్ లో ఉంటూ డ్రగ్స్ డెలివరి చేస్తున్నాడన్నారు. ఓఫోజర్ సండే ఎజిక్ అలియాస్ ఫ్రాంక్ అనే విదేశీయుడు నైజీరియాకు చెందినవాడని, కెమికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశారు. 2016లో స్పోర్ట్స్ వీసాపై భారత్‌కు వచ్చి న్యూఢిల్లీలో దిగారన్నారు. అతను ఫుట్‌బాల్‌లో న్యూ ఢిల్లీలోని ఆల్ స్టార్స్ ఆఫ్రికన్ స్పోర్ట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడని, 2018 సంవత్సరంలో అతను బెంగళూరుకు మారాడు , ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడేవాడు కానీ ఆదాయం పొందలేకపోయాడన్నారు. దీంతో డ్రగ్స్ సప్లయర్గా మారాడు.. బెంగళూరు లో తక్కువ ధరకు నైజీరియాన్ల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి హైదరాబాద్లో రెట్టింపు ధరకు సరఫరా చేసాడని, ఈ కేసులో మరో నిందితుడు అనాస్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందినవాడని, అనస్ ఖాన్ డ్రగ్స్ బానిస అయాడు..2022 సంవత్సరంలో వారు హైదరాబాద్‌కు వచ్చారన్నారు. డ్రగ్ సరఫరాదారుని ఆఫ్జోర్ సండే ఎజికే అలియాస్ ఫ్రాంక్ తో డ్రగ్స్ కొనుగోలు చేసి విక్రయిస్తున్నాడని, హైదరాబాద్ లో తన సోదరుడు సైఫ్ ఖాన్ సహాయంతో డ్రగ్స్ డెలివరీ చేస్తున్నాడని సీపీ తెలిపారు.