రాజేంద్రనగర్ పోలీసులతో పాటు సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు ఆపరేషన్ నిర్వహించి అంతరాష్ట్ర గంజాయి ముఠాను పట్టుకున్నారని డీసీపీ రాజేంద్రనగర్ శ్రీనివాస్ వెల్లడించారు. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 17 వద్ద గంజాయి తరలిచే ముఠాను పట్టుకున్నామని ఆయన తెలిపారు. ముఠా లోని ఐదుగురు నిందితులను పట్టుకున్నామని, సచిన్ ఠాగూర్ సింగతో పాటు వినోద్ అనే వ్యక్తలు ఈ ముఠా లో కీలక నిందితులు అని ఆయన పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి గత ఐదు సంవత్సరాలుగా గంజాయి…
గోదావరి ఉప్పొంగి ప్రవహించడంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజ్ నీటిమట్టం 11.75 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ క్రమంలో.. రానున్న కొద్ది గంటల్లో గోదావరి వరద మరింత పెరగనుంది.
ఇటీవల కూడా మహిళలు బయటకు రావాలంటే ఇబ్బందిగా ఉంది. అవును, కొంతమంది దుర్మార్గపు పురుషులు రోడ్డుపై లేదా బహిరంగ ప్రదేశాల్లో అమ్మాయిల ఎక్కడపడితే అక్కడ తాకడం లేదా వారి ప్రైవేట్ భాగాలను వారి ముందు చూపడం ద్వారా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కానీ చాలా మంది భయంతో దీని గురించి గొంతు ఎత్తడం లేదు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా జరిగాయి. కదులుతున్న రైలులో ఓ మహిళా ప్రయాణికురాలి ముందు తన ప్రైవేట్ పార్ట్లను చూపిస్తూ ఓ వ్యక్తి…
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రానికి కావాల్సిన అంశాలను కమిషన్ ముందు పొందుపరిచామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కమిషన్ ముందు అర్బన్ డెవలప్మెంట్ పై దాన కిషోర్, ఇతర అంశాల సీఎస్ శాంతకుమారి ప్రజెంటేషన్ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కు ప్రోత్సాహకాలు ఎక్కువగా ఉండాలని కోరాని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం తయారీ పథకాలకు అనుమతి ఇవ్వాలని కోరామని, ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను గత ప్రభుత్వాల…
బుడమేరు గండ్లు పడిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. మూడు గండ్లు పూడ్చిన విధానాన్ని మంత్రి నిమ్మల, ఇరిగేషన్ అధికారులు సీఎంకు వివరించారు. గండ్ల పటిష్టతకు తీసుకుంటున్న చర్యలను మంత్రి సీఎంకి తెలిపారు. భవిష్యత్తులో కూడా బుడమేరు డైవర్షన్ కెనాల్, బుడమేరు కాల్వ వల్ల నగరానికి ఇబ్బందులు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.
పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ స్వయంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తినని క్లారిటీ ఇచ్చారని శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎంని కలిశానని అరికేపూడి అన్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం కోర్టు పరిధిలో ఉంది దాని మీద స్పందించమని ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతకి ప్రక్రియ మొదలు పెట్టమంది.. నిర్ణయం తీసుకోమని చెప్పలేదన్నారు. అభివృద్ధి కోసం మా పార్టీ లోకి వస్తాం…
తెలంగాణలో మేము పర్యటిస్తున్నామని, ఇది మా ఆరో రాష్ట్రమని 16వ పైనాన్స్ కమిషన్ చైర్మన్ అర్వింద్ పనగారియా తెలిపారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చాలా పారదర్శకంగా చర్చలు జరిగాయని, రాష్ట్రం లోనీ ఆర్థిక పరిస్థితిని రాష్ట్రం వివరించిందన్నారు. తెలంగాణ లో ఉన్న భవిష్యత్ ప్రణాళిక లు పైనన్స్ కమీషన్ ను ఆకర్షించిందని, అర్బన్ డెవలప్మెంట్ పై తెలంగాణ పోకస్ చేయడం అభినందనీయమన్నారు అర్వింద్ పనగారియా. దీంతో పాటుగా గ్రామీణాభివృద్ధి పై కూడా పోకస్ చేశారని, రాష్ట్రం…
ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వివిధ రకాల ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేర్లు చేసే అంశంపై కంపెనీల ప్రతినిధులతో సీఎం చర్చలు జరుపుతున్నారు.