హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇవాళ ఆయన మెదక్ జిల్లాలోని నర్సాపూర్ బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. రేవంత్ హయాంలో హైదరాబాద్ ప్రతిష్ట మసక బారిందన్నారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని, కేంద్రం నుంచి వచ్చిన రూ.800 కోట్ల ఉపాధి హామీ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. రేవంత్ 9 నెలల పాలనలో 2 నెలల పెన్షన్ మింగేశారని హరీష్ రావు విమర్శించారు.
Top Headlines @9PM : టాప్ న్యూస్
ఫార్మాసిటీ, మెట్రో రైలు విషయంలో రేవంత్ రెడ్డి రూట్ మార్చారని ధ్వజమెత్తారు హరీష్ రావు. నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలో ఏ గ్రామానికి వెళ్లినా రూణమాఫీ కాలేదని చెబుతున్నారని, రుణమాఫీ కాలేదని నిరసన తెలుపుతూ కాంగ్రెస్ నాయకులను రైతులు బంధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రేవంత్ రెడ్డి తొందరపాటు వల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు గ్రామాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో 50 శాతానికి మించి రుణమాఫీ కాలేదు. 41 లక్షల మందికి రుణమాఫీ అవ్వాల్సి ఉంటే 21 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. చివరకు రైతుబంధు కూడా ఎగ్గొట్టారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు రుణమాఫీ చేసింది. దొడ్డు వడ్లకు బోనస్ అని మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇప్పుడేమో సన్నవడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామంటున్నారు. బోనస్‌ని బోగస్ చేశారని హరీష్ రావు మండిపడ్డారు.
Sundarakanda: ‘సుందరకాండ’లో సిధ్ శ్రీరామ్ పాడిన పాట విడుదల.. విన్నారా!