Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం
- నేడు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం
- విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి నివాళులర్పించిన పవన్ కల్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ సిబ్బందికి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 37,421 చ.కి.మీ. సుసంపన్నమైన అటవీ సంపద ఉందని.. శ్రీగంధం, ఎర్ర చందనం లాంటివి విలువైన వృక్ష జాతులు… అద్భుతమయిన వన్య ప్రాణులు మన అడవుల్లో ఉన్నాయని ఆయన తెలిపారు. అమూల్యమైన ఈ సహజ సంపదను అవిశ్రాంతంగా పరిరక్షించడంలో అంకిత భావంతో కూడిన మన రాష్ట్ర అటవీ సిబ్బంది ముందంజలో ఉన్నారని అన్నారు.
Read Also: Minister Kollu Ravindra: అక్టోబర్ నుంచి ఏపీలో కొత్త మద్యం విధానం
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ఈ వనరులను కాపాడుకునే క్రమంలో, మా ధైర్యవంతులైన సిబ్బందిలో కొందరు ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేసుకున్నారు. ఖేజ్రీ చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ తెగవారు చేసిన చారిత్రాత్మక త్యాగాన్ని స్మరించుకొంటూ సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంగా గుర్తించారు. మన అటవీ వనరుల రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన అటవీ శాఖ సిబ్బందికి హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. వారి త్యాగాలు స్మరణీయమైనవన్నారు. మన అడవులను, వన్యప్రాణులను భవిష్యత్ తరాలకు సంరక్షించే కీలకమైన కర్తవ్యాన్ని కొనసాగించడానికి వారి ధైర్యం, నిబద్ధత మనందరికీ ఎల్లప్పుడూ ప్రేరణగా ఉపయోగపడుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!