గత ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. సొంత ఆదాయం పెంచుకునేలా.. ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టేలా గత ప్రభుత్వం మద్యం పాలసీ చేసుకుందన్నారు.
బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. జాప్యం చేస్తే కోర్టు ధిక్కారంతో సమానమని, సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. BRS శాసనసభ్యులు బుధవారం అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారితో సమావేశమై అసెంబ్లీ స్పీకర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని ఒత్తిడి చేశారు. తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాకుండా ఇకపై తమ…
TG DSC 2024: డీఎస్సీ అభ్యర్థులకు పాఠశాల విద్యా శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. డీఎస్సీ అభ్యర్థులు టెట్ వివరాలను అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఎడిట్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి పాఠశాల విద్యా శాఖ వెసులుబాటు కల్పించింది.
వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాకులో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను కలిసి దాతలు చెక్కులను అందజేశారు. మంత్రి నారా లోకేష్‌ను హీరో సాయి ధరమ్ తేజ్ కలిశారు. వరద సాయం కింద రూ.10 లక్షల చెక్కును మంత్రి లోకేష్‌కు సాయి ధరమ్ తేజ్ అందించారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలు పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రెండో యూనిట్లో ఆయిల్ సింక్రానైజేషన్ చేసామని, త్వరలో యాదాద్రి ధర్మల్ పవర్ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వం సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగిందని, గత ప్రభుత్వానికి…
సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వినాయకుని నిమజ్జనం శోభాయాత్రలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చేనేత కాలనీలో ఏర్పాటు చేసిన 20 అడుగులు గల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతున్న సమయంలో విద్యుత్ వైర్లు తగిలి విగ్రహం కిందపడింది.
రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల హ్యాంగోవర్ నుండి బయట పడలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా పర్యటనలో దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల అవమాన పరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రధాని కాలేదన్న బాధతో మోడీ మీద అక్కసు తో దేశం మీద విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, రాహుల్ గాంధీ రిజర్వేషన్ లు రద్దు చేస్తామని అసలు రంగు బయట పెట్టారన్నారు…
AP Govt: స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో-సెబ్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్‌ను ఏర్పాటు చేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన 12 జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. సెబ్ విభాగానికి గత ప్రభుత్వం కేటాయించిన సిబ్బందిని రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర అధికారుల బృందం పర్యటించింది. చోడవరంలో దెబ్బతిన్న బొప్పాయి, అరటి, కంద పంటలను కేంద్ర బృందం పరిశీలించింది.