వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు సహాయక చర్యలు.. సీఎం సమీక్ష వరద ప్రభావిత ప్రాంతాల్లో 10వ రోజు అందుతున్న సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు.. సంబంధిత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.. ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి భారీవర్షాలు, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా కలెక్టర్లు.. అధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం చంద్రబాబు.. వరద ముంపుపై ఎన్యుమరేషన్ రేపు సాయంత్రానికి…
ఇటీవలి సంవత్సరాలలో, ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ ప్రజలలో చాలా పెరిగింది. ఆహారం నుండి బట్టలు, ఎలక్ట్రానిక్స్ వరకు ఎక్కువ మంది ప్రజలు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఆన్లైన్ షాపింగ్ వేగవంతమైన సేవలను అందించడంలో ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఘటనే ఇప్పుడు చోటుచేసుకుంది. పురుషుల లోదుస్తులను ఆర్డర్ చేసిన వ్యక్తికి బికినీ డెలివరీ చేయబడింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఢిల్లీకి చెందిన ప్రియాంష్ అనే వ్యక్తి…
చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుడమేరు, కృష్ణానది వరదలను వైసీపీ నేతలపై కక్ష తీర్చుకోవటానికి చంద్రబాబు ఉపయోగించటం దురదృష్టకరమని ఆరోపించారు. ప్రకాశం బ్యారేజ్‌ను 3 బోట్లు ఢీకొన్న ఘటనకు వైసీపీ కుట్ర కారణమని చంద్రబాబు అపవాదు వేస్తున్నారని అన్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యమని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఏలేరు వరద ముంపుపై అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏలేరు వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు పకడ్బందీగా చేపట్టాలని అధికారులను కోరారు. రైతులకు భరోసా కల్పించండి.. వైద్య సేవలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని తెలిపారు. ఏలేరు వరద ముంపు ప్రభావితమైన 21 మండలాల్లోని 152 గ్రామాల్లో సహాయక చర్యలను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
గణేష్ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్ట్ శుభవార్త చెప్పింది. గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా నగరం నలుమూలల నుంచి భారీగా తరలివచ్చే వినాయకులు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేస్తుంటారు. ఖైరతాబాద్ గణేశుడి నుంచి వీధుల్లో ఏర్పాటు చేసే చిన్న బొజ్జ గణపయ్యలను కూడా సాగర్‌లో నిమజ్జనం చేస్తారు. కానీ.. ఇప్పుడు ఆ సంప్రదాయానికి ఈసారి ఫుల్ స్టాప్ పడుతందని భావించిన వేళ హైకోర్టు ఊరటనిచ్చింది. ఈ సంవత్సరం కూడా హుస్సేన్ సాగర్‌లోనే…
ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్లను ఇంజనీర్లను తొలగిస్తున్నారు. రెండు భారీ క్రేన్లతో బోట్లను తొలగిస్తున్నారు. బ్యారేజీకి ప్రమాదం లేకుండా బోట్లను నది ప్రవాహం వైపు పంపే ప్రయత్నం చేస్తున్నారు. బోట్లను వైర్లతో లాక్ చేసి నదిలో వంగిపోయిన బోటును రివర్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత.. బోటును డైరెక్షన్ మార్చేందుకు చూస్తున్నారు.
తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా..…
పార్టీ ఫిరాయింపులు, అనర్హత పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కోర్టు తీర్పుపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు శునకానందాన్ని పొందుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది వాళ్ళు చేస్తే నీతి.. వేరే వాళ్ళు చేస్తే అవినీతి అన్నట్టు ఉందని విమర్శించారు. అనర్హత వేటు పడుతుంది.. ఉప ఎన్నికలు వస్తాయి.. ఇవ్వన్నీ మాట్లాడే అర్హత బీఆర్ఎస్ కి లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అకాల వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని పంపనుంది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) సలహాదారు, కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ (ఆపరేషన్స్&కమ్యూనికేషన్స్) కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం బుధవారం (11 సెప్టెంబర్) నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఈ బృందంలో కల్నల్ కేపీ సింగ్‌తో పాటుగా..…
జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాల పైన సత్యదూరమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. గతంలో కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం వణికిపోతుంటే బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో కనీసం అట్టి కరోనా వ్యాధిని ఆరోగ్య…