ప్రెగ్నెన్సీ లేకుండానే 9 నెలలపాటు గర్భవతి అని మేనేజ్ చేయడం సాధ్యమా.. ఇది సినిమాల్లో సీరియల్స్ లోనే సాధ్యం అంటారా.. అయితే జనగామ జిల్లాలోని ఓ మహిళ నిజ జీవితంలోనూ … దీన్ని నిజం చేసింది… మహిళ ప్రెగ్నెన్సీ కాకుండానే.. 9 నెలల పాటు ఎక్కడ అనుమానం రాకుండా మేనేజ్ చేసి కాన్పు కోసం ఆస్పత్రికి వచ్చింది.. నానా హంగామా సృష్టించి చివరికి పోలీస్ స్టేషన్ కు చేరింది
జనగామ మాతా శిశు ఆస్పత్రిలో ఓ మహిళ హై డ్రామా ఆడింది. పురిటి నొప్పులు వస్తున్నాయని, ఆస్పత్రికి వచ్చిన ఆ మహిళ.. డెలివరీ చేయాలంటూ వైద్య సిబ్బందిని కోరింది వైద్య సిబ్బంది మహిళను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడానికి రెడీ అవుతున్న సమయం వాష్ రూమ్ కి వెళ్ళొస్తానంటూ వాష్ రూమ్ కి వెళ్ళిన మహిళ ఆ తర్వాత వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీ మూలంగా అబార్షన్ అయిపోయిందంటూ ఆసుపత్రి సిబ్బందిపై నింద వేసింది. మహిళ తిరుప అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది మహిళా వెళ్లిన వాష్ రూమ్ లో పరిశీలించి అనుమానించారు.. వైద్యులు మహిళలను వైద్య పరీక్షలు చేసి అసలు ప్రెగ్నెన్సీ కాదంటూ దుబాయించడంతో పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది
Pawan Kalyan: అటవీ సంపదను కాపాడటంలో సిబ్బంది త్యాగాలు స్మరణీయం
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నాగులగుంట గ్రామానికి చెందిన పల్లవికి రెండు సంవత్సరాల క్రితం రాగ్యతండాకు చెందిన సుమన్ తో వివాహం జరిగింది. 8 నెలల క్రితం తాను గర్భం దాల్చానని భర్తకు, అత్తమామలకు చెప్పింది. మూడో నెలలో తల్లి గారి ఇంటికి వెళ్లిన పల్లవి 7 నెలల పాటు తల్లి గారి ఇంటి దగ్గరే కాలం వెళ్లదీసింది గర్భవతిగా నటిస్తూ ఉండిపోయింది. గర్భిణీగా నటిస్తున్న పల్లవి, బుదవారం పురిటి నొప్పులు వస్తున్నాయని జనగామ జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు ఆస్పత్రికి వచ్చింది. అడ్మిషన్ ప్రక్రియ చేసుకున్న క్రమంలోనే , వాష్ రూమ్ వెళ్లి వస్తానని చెప్పి.. బాత్రూం కి వెళ్ళిన పల్లవి బాత్రూం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వైద్య సిబ్బంది తీరును తప్పుపడుతూ ఆగ్రహంతో నానా హంగామా చేసింది. మీ వల్లే నా గర్భం పోయిందని, డాక్టర్లు పట్టించుకోకపోవడం వల్లే పిండం బాత్రూమ్ లో పడిందని గగ్గోలు పెట్టింది. మహిళ ఆరోపణలపై అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది బాత్రూం కి వెళ్లి చూస్తే అబార్షన్ అయినా ఆనవాళ్లు కానీ డెలివరీ అయిన ఆనవాళ్లు కానీ ఏవి కనిపించలేదు పైపెచ్చు మూడు చీరలు బాత్రూంలో దొరకడంతో అనుమానం వచ్చిన వైద్య సిబ్బంది డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు నిలదీశారు వైద్య పరీక్షలు చేసి అసలు ఆవిడ గర్భవతి కాదని తేల్చి ఇదేంటని ప్రశ్నిస్తే…. తిరిగి వైద్య సిబ్బందిపై గొడవకు దిగడంతో, పోలీసులకు సమాచారమిచ్చారు ఆస్పత్రి సిబ్బంది.
Maharashtra: దారుణం.. 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
ఆసుపత్రి వర్గాల నుంచి ఫిర్యాదు అందడంతో సదరు మహిళను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారణ చేస్తే పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లలు కావట్లేదని సంవత్సర కాలంగా అత్తింటివారు తిడుతున్నారని… అందుకే గర్భవతి డ్రామా అడాల్సి వచ్చిందని పోలీసుల విచారణలో తేలింది. 8 నెలలుగా గర్భవతినంటూ దుస్తుల వెనుక బట్టలను అమర్చుకొని గర్భవతి నాటకం ఆడినట్లుగా తేలింది. ఆస్పత్రికి సైతం రెండు చీరలను పొట్టపై అమర్చుకొని గర్భవతిలా నటిస్తూ వచ్చినట్లుగా మహిళా ఒప్పుకుంది. మరి 9నెలలుగా భర్తను, అత్తింటివారిని, గ్రామస్తులను, చివరికి గ్రామంలోని ఆశా కార్యకర్తలను ఎలా నమ్మించిందోనని తలలు గొక్కుంటున్నారు ఆస్పత్రిలో ఈ ఎపిసోడ్ చూసిన రోగులు, ఆస్పత్రి సిబ్బంది. ఇక పల్లవి మానసిక పరిస్థితి సరిగా లేదని గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చే పనిలో పడ్డారు పోలీసులు, వైద్యులు.