Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. కనుమ దారిలో వస్తున్న కారు, బైకును కంటైనర్ లారీ అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కంటైనర్ కారుపై పడిపోవడంతో కారులోని నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి గాయాలు కాగా.. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారులో ఓ యువకుడు కాపాడాలంటూ వేడుకుంటున్న దృశ్యాలు కంట తడి పెట్టించాయి.
Read Also: Road Accident : ముజఫర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు మృతి