బొట్టు పెట్టుకుని పూజలకే పరిమితమయ్యే వాళ్లు హిందువులు కాదని, హిందువులపై దాడిని అడ్డుకుంటూ హిందూ ధర్మ రక్షణకు పాటుపడేవాళ్లే నిజమైన హిందువులని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈరోజు సాయంత్రం బండి సంజయ్ ఖైరతాబాద్ బడా గణేశ్ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ తోపాటు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గౌతమ్ రావు, అధికార ప్రతినిధి జె.సంగప్ప, బద్దం మహిపాల్ రెడ్డి తదితరులు బడా గణేశ్ ను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ…
Maharashtra: దారుణం.. 10 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
‘‘ఖైరతాబాద్ గణేశ్ ను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ గణేశ్ ను ప్రతిష్టించి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 71 అడుగుల ఎత్తులో గణేశ్ విగ్రహాన్ని నెలకొల్పడం సంతోషం. హిందువులపై దాడి జరిగితే.. అడ్డుకునే వాళ్లు, హిందూ సమాజం కోసం పనిచేసే వాళ్లే నిజమైన హిందువులు. ధర్మం కోసం, సమాజ రక్షణ, గో రక్షణ, సమాజ పరిరక్షణ కోసం పనిచేయాలని ప్రతి ఒక్క హిందువును కోరుతున్నా.’’అని పేర్కొన్నారు.
Mallikarjun Kharge: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చుంటే వారంతా జైల్లో ఉండేవారు
‘‘ఆనాడు బ్రిటీష్ పారద్రోలడానికి బాల గంగాధర్ తిలక్ హిందువులందరి ఏకం చేసేందుకు గణేశ్ ఉత్సవాలను ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ఆనవాయితీగా వస్తోంది. హిందువులందరినీ సంఘటితం చేసేందుకు ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలను విజయవంతంగా ప్రశాంతంగా వాతావరణంలో నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నా.’’ తెలిపారు.