Accident: ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. నూజివీడు సమీపంలోని దేవరకొండ నుంచి ఆటోలో చిన్న వెంకన్న దర్శనానికి భక్తులు వచ్చారు. దర్శనం అనంతరం శివాలయం ఘాట్ రోడ్ నుంచి ఆటోలో కిందికు దిగుతున్న సమయంలో ఆటో బ్రేక్ ఫెయిల్ అయింది. ఆర్చిగేట్ ముందు షాపు షట్టరు ఢీకొట్టి ఆటో ఆగిపోవడంతో పెనుప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడిన భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు.
Read Also: Hyderabad: భార్యకాపురానికి రావడం లేదనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య..