టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ ఎక్స్‌పర్ట్ ఆకాష్ చోప్రా.. ఇటీవల టీమిండియా ప్యూచర్ ఆటగాళ్లు ఎవరో చెప్పారు. ముగ్గురు యువ ఆటగాళ్ల గురించి చెప్పారు. అందులో.. శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ ఉన్నారు. పంత్‌ను యువరాజ్ సింగ్, సురేష్ రైనాగా కూడా అభివర్ణించాడు. 2022లో కారు ప్రమాదం తర్వాత రిషబ్ పంత్ అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి వచ్చాడు. అతను మొదట టీ20 ప్రపంచ కప్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అతను శ్రీలంక పర్యటనలో వన్డేల్లో కూడా ఆడాడు. ఇప్పుడు అతనికి ఇష్టమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌లో అతని పునరాగమనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సిరీస్ సందర్భంగా జరుగనుంది.
R. Ashwin: రిటైర్మెంట్పై టీమిండియా స్టార్ స్పిన్నర్ కీలక ప్రకటన..
రాజ్ షామ్నీ పోడ్‌కాస్ట్‌లో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. మొదట శుభ్‌మాన్ గిల్ గురించి, “అతను భవిష్యత్ సూపర్ స్టార్ అయ్యే లక్షణాలు కలిగి ఉన్నాడు, శుభ్‌మాన్ గేమ్ పల్స్‌ని అర్థం చేసుకుంటాడు. చాలా సంవత్సరాలు ఆడిన చాలా మంది ఆటగాళ్ళు ఆట యొక్క పల్స్‌ను అర్థం చేసుకోలేరు, కానీ కొంతమంది ఆటగాళ్లు దానిని త్వరగా అర్థం చేసుకుంటారు. గొప్పవాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటారు. విరాట్ కోహ్లీ కూడా ఆట పల్స్‌ను ముందుగానే అర్థం చేసుకున్నాడు. ఎంఎస్ ధోనీ కూడా వన్డేల్లో బ్యాటింగ్ ప్రాముఖ్యతను త్వరగా అర్థం చేసుకున్నాడు. శుభమాన్ గిల్‌కి కూడా మంచి అవగాహన ఉంది.” అని అన్నాడు.
Delhi CM : ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి ?
యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుతూ, “అతను ఇప్పుడు చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అతను చాలా కష్టపడుతున్నాడు.. అతని కష్టంతో అందరినీ ఓడించగలడు. అతను మూడు ఫార్మాట్లలో ఆడగల సత్తా ఉంది.” అని చెప్పుకొచ్చాడు. రిషబ్ పంత్ గురించి మాట్లాడుతూ, “పంత్‌కు భిన్నమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆ స్కిల్స్‌తో ఎవరూ ఊహించని ప్రదర్శ చూపించగలడు.. నేను అతనిని మొదటిసారి చూసినప్పుడు, అతను వైట్ బాల్ క్రికెట్‌లో సురేష్ రైనా, యువరాజ్ సింగ్‌ల కలయిక అని అనుకున్నాను. అయితే టెస్టు క్రికెట్‌లో అతని ప్రత్యేకత బయటపడింది. అతను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో ఆడినప్పుడు సంచలనం సృష్టించాడు.” అని ఆకాష్ చోప్రా చెప్పారు.