తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్‌గా రేవంత్ రెడ్డి స్థానంలో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. లాంఛనప్రాయ కార్యక్రమంలో, పదవీ విరమణ చేసిన టిపిసిసి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి పార్టీ జెండాను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేసి, పార్టీని నూతనోత్సాహంతో ముందుకు నడిపించాలని కోరారు. మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముందు మహేశ్ ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించగా, సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్పూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. లక్షలాది మంది కార్యకర్తలు అవమానాలు భరించి..జెండాను అధికారంలోకి తెచ్చారని, కాంగ్రెస్ నీ గెలిపించింది కార్యకర్తలు.. కార్యకర్తలు తల ఎత్తుకుని పని చేసేలా పని చేస్తున్నామన్నారు. ఒకేసారి 18 వేల కోట్లు రుణమాఫీకి ఇచ్చిన పార్టీ దేశంలో ఎక్కడా లేదని, గాంధీ భవన్ నుండి వచ్చే ఆదేశాలు ప్రభుత్వం పాటిస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలది..ప్రజలకే సంపద పంచే పనిలో ఉన్నామని, కాంగ్రెస్ లో పని చేసిన ఏ ఒక్కరినీ వదిలేయమని ఆయన వెల్లడించారు. ఈ ప్రభుత్వం మనది అని ప్రజలకు చెప్పండన్నారు.
Rain Alert: ఈ రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు..
కాంగ్రెస్ ఇంచార్జీ దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ.. ‘కార్యకర్తలు అంతా.. పునరంకితం అవ్వాలి. రాహుల్ గాంధీ స్వప్నం.. కుల గణన. ఓ వైపు సర్కార్..ఇంకో వైపు పార్టీ సమన్వయంతో పని చేయాలి.’ అని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సామాజిక న్యాయం కి కట్టుబడి పార్టీ ఉందని అధిష్టానం నిరూపించింది. పార్టీలో సుదీర్ఘంగా పని చేస్తున్న వ్యక్తికి పిసిసి ఇవ్వడం సంతోషం. ఇతర పార్టీల్లో ఒకే సామాజిక వర్గం కి అధ్యక్ష పదవి ఉంటుంది. కానీ కాంగ్రెస్ లోనే ఎవరికైనా పార్టీ బాధ్యతలు ఇస్తుంది అని. మహేష్ గౌడ్ నేతృత్వంలో పార్టీ బలోపేతం అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం తోనే అధికారం వచ్చింది.
కార్యకర్తల చెమట కష్టం అధికారంలోకి రావడం. మోడీ గ్రాఫ్ తగ్గిపోయింది.. వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నారు. సెప్టెంబర్ 17 నాడు విముక్తి కి… తెలంగాణా ఏర్పాటు లో బీజేపీ పాత్ర లేనే లేదు. కేవలం కాంగ్రెస్ పాత్ర మాత్రమే ఉంది. బీజేపీ కి…సెప్టెంబర్ 17 కి ఏం సంబంధం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.