CM Revanth: కేసీఆర్, కేటీఆర్లపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..
- కేసీఆర్.. కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం
- ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోంది- సీఎం
- రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు- సీఎం
- ఐటీ మంత్రి అయ్యావ్.. లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు- రేవంత్ రెడ్డి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్, కేటీఆర్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు మహిళకు మంత్రి వర్గంలో చోటు ఇవ్వని సన్నాసులకు మహిళా అభివృద్ధి గురించి ఏం తెలుస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. రాజీవ్ గాంధీ తెచ్చిన కంప్యూటర్ పరిజ్ఞానంతోనే అమెరికా వెళ్లి జాబ్ చేశావు.. ఐటీ మంత్రి అయ్యావ్, లేకపోతే కేటీఆర్ మంత్రి దరిద్రం ఉండేది కాదు అని విమర్శించారు. లేకపోతే గుంటూరులో చాయ్, టిఫిన్స్ అమ్ముకుంటూ ఉండేవాడివి.. సిద్దిపేటలో ఛాయ్ అమ్ముకుంటూ ఉండేటోడివి అంటూ ఎద్దేవా చేశారు. ఎంత బలుపు మాటలు.. అధికారం పోయిన మదం తగ్గలేదని కేటీఆర్ పై ధ్వజమెత్తారు.
Demonte Colony 2: భయపెట్టడానికి మీ ఇంటికే ‘డీమాంటే కాలనీ 2’.. జాగ్రత్త!
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
త్యాగాలు అంటే నెహ్రూ, ఇందిరమ్మ, రాజీవ్ కుటుంబాలవేనని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గాడిదలకు ఏం తెలుసు గంధపు చెక్కల వాసన అని దుయ్యబట్టారు. మీ ఫామ్ హౌజ్‌లలో జిల్లెళ్లు మొలిపిస్తానని చురకలు అంటించారు. రాజీవ్ గాంధీ విగ్రహం సాక్షిగా కాంగ్రెస్ కార్యకర్తలకు చెబుతున్నా.. వెయ్యి ఎకరాల్లో తండ్రి ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడు.. కొడుకు వంద ఎకరాల్లో జన్వాడలో ఫామ్ హౌజ్ కట్టించుకున్నాడని అన్నారు. సొంత విగ్రహం పెట్టుకునేందుకు సెక్రటేరియట్ ముందు స్థలాన్ని పెట్టుకున్నాడు అని తెలిపారు. ‘ఎవడొస్తాడో రండిరా.. టైమ్ చెప్పండి.. ఎవడు వస్తాడో చూస్తా.. తెలంగాణ ఇచ్చింది మేము.. తెలంగాణ తెచ్చింది మేము… సెక్రటేరియట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టేది మేము..’ అని అన్నారు.
BJP: 10 రోజుల అమెరికా పర్యటనలో 5 గంటలే మాత్రమే సమావేశాలు.. రాహుల్ గాంధీ మిగతా సమయం ఎక్కడ..?
బీఆర్ఎస్ ఏర్పాటుకు స్థలాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే కేసీఆర్ కుటుంబం ఒక్కరు కూడా హాజరు కాలేదని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు రెగ్యులర్‌గా షాక్ ట్రీట్మెంట్ జరుగుతుంది.. అర్థం కావడానికి కొంత సమయం పడుతుందని విమర్శించారు. కాలకేయ ముఠా గ్రామాల మీద పడుతుంది.. కొంతమంది మిడతల దండును మన ప్రజల మీదకు ఉసి గొల్పుతున్నరు.. కాంగ్రెస్ కార్యకర్తలు ఆ మిడతల దండును తరిమికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!