నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డిపల్లిలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుమల లడ్డూ వివాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రాంచీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తేనెటీగల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. మృతురాలు భర్త సునీల్ బార్లా తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 21 (శనివారం) తన భార్య జ్యోతి గాడి తన తల్లి గారింటికి వెళ్లింది. ఈ క్రమంలో.. ఇంటికి సమీపంలోని ఓ బావిలో స్నానం చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందని తెలిపాడు.
గుంటూరు జిల్లాలో రైల్వే, జిల్లా కోర్టులలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ గుంజి శ్రీనివాస్ రావు అనే వ్యక్తి మోసం చేశాడని భాదితులు ఫిర్యాదు చేశారు. పదిమంది వద్ద సుమారు కోటి రూపాయలు వసూలు చేశాడని చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావుపై ఆరోపణలు వచ్చాయి.
చైనాలో నెబ్యులా-1 అనే రాకెట్ బ్లాస్ట్ అయింది. ప్రయోగం సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రాకెట్ చైనాకు చెందిన డీప్ బ్లూ ఏరోస్పేస్ కంపెనీకి చెందినది. ఈ రాకెట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. అయితే మిషన్ కోసం నిర్దేశించిన 11 లక్ష్యాలలో 10 సాధించినట్లు కంపెనీ తెలిపింది.
మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోట్ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్ష పదవిని ఒక బాధ్యతగా భావిస్తా అని, పార్టీని ముందుకు నడపడంలో సమిష్టి బాధ్యత అవసరమని నేను నమ్ముతున్నా అని ఆయన అన్నారు. కార్యకర్తలు, నాయకులకు నిత్యం అందుబాటులో ఉంటా అని ఆయన వెల్లడించారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని ఆయన తెలిపారు. కార్యకర్తలు కష్టపడి పార్టీని అధికారంలోకి…
ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణా నదిలో ఇప్పటికే మూడు బోట్లను తొలగించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. నీటి అడుగున మరో రెండు బోట్లు ఏమైనా ఉన్నాయేమోనని గాలింపు చేపడుతున్నామన్నారు.
ఆదివారం ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది మృతి చెందారు. అంతేకాకుండా.. 20 మంది గాయపడ్డారు. గత కొన్నేళ్లుగా దేశంలో జరిగిన ఘోర ప్రమాదాల్లో ఇదొకటి అని ప్రభుత్వ మీడియా పేర్కొంది. ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లో ఈ పేలుడు సంభవించింది.
శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ వున్న అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. కల్తీ వస్తువులను అరికట్టడానికి టీటీడీ చర్యలు ప్రారంభించిందన్నారు.
మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోట్ల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత్తన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం, లోక్ సభ సీట్లు గెలిచామని, మహేష్ కుమార్ గౌడ్‌ను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతు సీఎల్పీ ఏకగ్రీవ తీర్మానం చేస్తోందన్నారు. పార్టీ నాయకత్వం ప్రభుత్వ…
CM Chandrababu: తిరుమలలో జరిగిన అపచారంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొ్న్నారు. అపచారం ఎవరి వల్ల జరిగింది..? ఎందుకు జరిగిందనే అంశంపై విచారణ చేసి సిట్ నివేదిక ఇస్తుందన్నారు. టీటీడీలో జరిగిన అపవిత్రానికి ప్రాయశ్చిత్తంగా రేపు హోమం చేస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో.అక్కడి సంప్రదాయం ప్రకారం శుద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. దేవాలయాల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. Read Also: AP CM…