డయల్ 100పై వెంటనే స్పందించి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురవుతున్న బాధితుడిని రక్షించారు. బాధితుడిని ఆస్పత్రికి సరైన సమయానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన బండ్లగూడ పోలీసుల పనితీరును స్థానికులు,బాధితుని బంధువులు , సామాజిక మాధ్యమాల్లో చూసినవారు బండ్లగూడ పోలీసుల పనితీరును మెచ్చుకుంటు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఐజాజ్ జహంగీరబాద్ కు చెందిన ఖతిజ పరిచయిస్తులు, కొంతకాలంగా ఐజాజ్ ఖతిజను లైగింగా వేధిస్తున్నాడు, వేధింపులు ఎక్కువకావడంతో ఖతిజ…
న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు.
టెస్ట్ క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన ఆటగాళ్లలో ఒక్క భారత ఆటగాడి పేరు లేదు. వీరేంద్ర సెహ్వాగ్, రిషబ్ పంత్ వంటి భారీ హిట్టర్స్ ఉన్నప్పటికీ.. టెస్టుల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ సాధించిన జాబితాలో లేరు. భారత ఆటగాళ్ల పేరిట ఎన్నో అరుదైన రికార్డులున్నప్పటికీ, ఈ రికార్డు లేకపోవడం గమనార్హం.
మాపై హత్యాయత్నం చేశారు.. సునీతా లక్ష్మారెడ్డి కీలక వ్యాఖ్యలు వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా మా గ్రామంలో ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవన్నారు. వినాయక నిమజ్జనం వేడుకల పేరుతో మాపై హత్యాయత్నం చేశారన్నారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదన్నారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారన్నారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి…
ఏపీలో చేపట్టిన బదిలీలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్స్, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈఓ, డీఎల్డీఓ బదిలీల ప్రక్రియలో నిబంధనలను అనుసరించాలని అన్నారు.
జానీ మాస్టర్ కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ వేశారు. జానీ మాస్టర్‌ను కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. జానీ మాస్టర్‌ను విచారించి మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సిఉందన్న పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో జానీ మాస్టర్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు కస్టడీ పిటిషన్లో పేర్కొన్నారు. అయితే.. లైంగిక వేధింపులు, పోక్సో్ కేసు నమోదైన నేపథ్యంలో జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. గోవాలో ఉన్నట్లు…
తిరుమల లడ్డు కల్తీ ఘటనను నిరసిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా తెనాలి వైకుంఠపురం దేవస్థానంలో తలపెట్టిన మహాయాగంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
ప్రజల దృష్టి మళ్లించేందుకే ‘అమృత్’పై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడదుల చేశారు. అవినీతి బయటకు రావాలంటే సీవీసీ విచారణ కోరాలని, దేశంలో పట్టణాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చే ఒక సదుద్దేశ్యంతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమృత్ పథకాన్ని ప్రవేశపెడితే.. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ ఈ పథకం ప్రయోజనాలు ప్రజలకు అందకుండా చేస్తున్నాయన్నారు. ఈ…
హైడ్రా ఇప్పటివరకు ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, నాలాల పైన దృష్టి పెట్టింది. మొదటి సారి రంగారెడ్డి జిల్లా ఔటర్ బయట ఉన్న రూరల్ ప్రాంతంలోని చెరువులు, నాలాలను హైడ్రా బృందం పరిశీలించింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని మసాబ్ చెరువు, పెద్ద చెరువుల పరిధిలోని నాలాలను హైడ్రా సోమవారం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పరిధిలోని ఉప్పరిగూడ, పోచారం గ్రామాల్లోని బఫర్ జోన్, ఎఫ్టీఎల్ ను…
మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్…