రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా...రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా... ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం…
రేణుకాస్వామి హత్యకేసులో ముగ్గురు నిందితులకు షరతులతో కూడిన బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. అంతేకాకుండా.. వారిపై హత్యానేరం ఎత్తివేసింది. నిందితుడు కేశవ్ మూర్తికి కర్ణాటక హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరో ఇద్దరు నిందితులు కార్తీక్, నిఖిల్లకు కూడా బెంగళూరు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
వరద, పంట నష్టంపై బాధితులకు ఇవ్వాల్సిన పరిహారం ప్యాకేజీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని 179 సచివాలయాల పరిధిలో మునిగిన ఇళ్లకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ జీవో జారీ చేసింది.
ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా.. ‘గత ప్రభుత్వంలో జరిగిన దుర్ఘటనలు. 2017 లో కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో 3 రోజుల్లో 6గురు బాలింతలు చనిపోయారు. 2017లో 5రోజుల వ్యవధిలో నీలోఫర్ హాస్పిటల్ లో 5గురు బాలింతలు చనిపోయారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం DPL పద్ధతిలో చేసిన ఆపరేషన్ లతో 4గురు మహిళలు చనిపోయారు. దీనితో వారి పిల్లలు అనాధలయ్యారు. మీరు ఇచ్చిన హామీ…
తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు.
రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంగాల ద్వారా 4,496,ఐ.కే.పి కేంద్రాల ద్వారా 2102,ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ…
బీజేపీలో చేరాల్సిందిగా మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆహ్వానంపై సిర్సా ఎంపీ కుమారి సెల్జా స్పందించారు. ఓ మీడియా ఛానెల్తో మాట్లాడిన శైలజ.. కాంగ్రెస్ రక్తం తన సిరల్లో ఉందని అన్నారు. తాను కాంగ్రెస్వాదిగానే ఉంటానని సూటిగా చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి వైరం లేదని అన్నారు. రానున్న కాలంలో హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలిపారు.
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రిమాండ్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వెళ్లగా.. అదే సమయంలో సబ్ జైలు బయట బీజేపీ - వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఈ క్రమంలోనే ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.