Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 9pm 23 09 2024

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Published Date :September 23, 2024 , 9:19 pm
By Gogikar Sai Krishna
Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

మళ్లీ ఆకాశానికి రారాజుగా ఎయిర్ ఇండియా? “టాటా గ్రూప్” ప్లాన్!

ఎయిర్ ఇండియా ఒకప్పుడు ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థల్లో ఒకటి. జనవరి 2022లో.. ఇది ఏడు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్‌కి తిరిగి వచ్చింది. టాటా మరోసారి దానిని ప్రపంచంలోని అగ్రశ్రేణి విమానయాన సంస్థగా మార్చడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం టాటా గ్రూప్ ఐదేళ్ల లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దీని కింద ఎయిర్ ఇండియా విమానాలకు కొత్త విమానాలు జోడించనున్నారు. ఐటీ వ్యవస్థలు పునఃరూపకల్పన చేయనున్నారు. అంతర్గత ప్రక్రియలు క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టబడి పెట్టేందుకు టాటా సిద్ధమైంది. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా బ్రాండ్ ఇమేజ్‌ని పునరుద్ధరించడానికి, లెగసీ సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోంది.

ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.. డిఫాల్టర్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చేది లేదు

రాష్ట్రంలో పండిన ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర నీటిపారుదల , పౌర సరఫరాల శాఖామంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంగాల ద్వారా 4,496,ఐ.కే.పి కేంద్రాల ద్వారా 2102,ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం మఱ్ఱి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో 2023-24 ఖరీఫ్ పంట కొనుగోలుపై రాష్ట్రంలోనీ జాయింట్ కలెక్టర్ లు,జిల్లా పౌర సరఫరాల అధికారులు, జిల్లా స్థాయి పౌర సరఫరాల శాఖా మేనేజర్లతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌర సరఫరాల శాఖా ముఖ్య కార్యదర్శి డి.యస్. చవాన్, జాయింట్ సెక్రటరీ ప్రియ్యంకా అలా,స్టేట్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ యం.డి.లక్ష్మి, మార్కెటింగ్ డైరెక్టర్ ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది..

తిరుమల శ్రీవారి ఆస్తుల పరిరక్షణ బాధ్యత కూటమి ప్రభుత్వానిదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. భక్తులు స్వామిపై విశ్వాసంతో ఆస్తులిచ్చారని.. వాటిని నిరర్థక ఆస్తులని టీటీడీ గత పాలక మండలి అమ్మే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. గత ప్రభుత్వం టీటీడీ ఆస్తులను.. భగవంతుడి ఆభరణాలకు రక్షణ కల్పించిందా లేదా అనే కోణంలో విచారణ అవసరమన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసంతో తమకు ప్రాప్తించిన ఆస్తిపాస్తులు దైవానుగ్రహమని భక్తులు భావిస్తారన్నారు. తమ ఆస్తులను ఆ భగవంతుడికే ఇచ్చేస్తూ… దస్తావేజులను హుండీలో వేసే భక్తులూ ఉన్నారని పవన్ వెల్లడించారు. అలా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు.. ఇలా పలు రాష్ట్రాల్లో స్థిరాస్తులు ఉన్నాయన్నారు. ముంబయి, హైదరాబాద్ నగరాల్లో భవనాలు ఉన్నాయన్నారు.

పోలీసులపై కాల్పులు జరిపిన అత్యాచార నిందితుడు.. ఏమైందంటే?

బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో అమాయక బాలికలపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు అక్షయ్ షిండే పోలీసు కారులోంచి రివాల్వర్ లాక్కొని పోలీసు బృందంపై కాల్పులు జరిపాడు. నిందితులు పోలీసు బృందంపై అనేక రౌండ్లు కాల్పులు జరిపాడు. ఇందులో పోలీసు అధికారులు కూడా గాయపడ్డారు. తలోజా జైలు నుంచి పోలీసు బృందం అక్షయ్‌ను తమతో తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. నిందితులు పోలీసు బృందంపై కాల్పులు జరపడంతో.. వారు నిందితులపై ప్రతీకారం తీర్చుకున్నారని, అక్షయ్‌పై కాల్పులు జరిపారని పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

బీఆర్‌ఎస్‌కు మంత్రి దామోదర కౌంటర్‌

ప్రభుత్వంపై బీఆర్ఎస్‌ చేస్తున్న ఆరోపణలకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ వేదికగా.. ‘గత ప్రభుత్వంలో జరిగిన దుర్ఘటనలు. 2017 లో కోటి మెటర్నిటీ హాస్పిటల్ లో 3 రోజుల్లో 6గురు బాలింతలు చనిపోయారు. 2017లో 5రోజుల వ్యవధిలో నీలోఫర్ హాస్పిటల్ లో 5గురు బాలింతలు చనిపోయారు. 2022లో కుటుంబ నియంత్రణ కోసం DPL పద్ధతిలో చేసిన ఆపరేషన్ లతో 4గురు మహిళలు చనిపోయారు. దీనితో వారి పిల్లలు అనాధలయ్యారు. మీరు ఇచ్చిన హామీ పిల్లలకు ఉచిత విద్య, ఉద్యోగం, ఇల్లు అటకెక్కినవి. 2019లోని జూన్, జూలై డెంగ్యూ మరణాల సంఖ్య 100 మంది. మెటర్నటీ డెత్స్, పీడియాట్రిక్ డెత్స్ నెలవారి సగటున మరణాలు తగ్గాయి. కమిటీల పేరుతో కాలయాపన చేశారు తప్ప…శాశ్వత పరిష్కారం గత ప్రభుత్వం చూపించలేకపోయింది. మీ నిర్వాకం వల్ల వైద్యం పేదలకు అందని ద్రాక్ష గా మిగిలింది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనుచందంగా వ్యవస్థ మారింది. ఇవన్నీ నిజ నిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాలి. మీరు మాట్లాడే అబద్ధాలకు ఇవే సాక్ష్యం. గత 10 సంవత్సరాల పాలనలో మీరు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిన వ్యవస్థను మేము గాడిలో పెడుతున్నాం.’ అని స్పందించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కసరత్తు

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు పుల్ స్టాప్ కు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే జంట కమిషనర్ల పరిధిలో సమన్వయ కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకుంది. 3 పోలీస్ కమిషనర్ల తో కలిపి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ట్రాఫిక్ తో పాటు ఇతరత్రా సమస్యలపై సమన్వయ కమిటీ చర్చించనుంది. ట్రాఫిక్ నియంత్రణ రోడ్ల అభివృద్ధిపై ప్రధానంగా కమిటీ చర్చించనున్నట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైడ్రా తోపాటు పోలీసు కమిషనర్లతో కమిటీ ఏర్పాటు రంగం సిద్దం చేస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం హైటెక్ కంపనీ లతో అనుసంధానం కానుంది కమిటీ. అయితే… ఇదిలా ఉంటే.. హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో అత్యవసర భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్లు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారులు సమావేశమయ్యారు.

కిడ్నాపర్ల దాడి.. 100 డయల్ చేయడంతో తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు..

డయల్ 100పై వెంటనే స్పందించి కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురవుతున్న బాధితుడిని రక్షించారు. బాధితుడిని ఆస్పత్రికి సరైన సమయానికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిన బండ్లగూడ పోలీసుల పనితీరును స్థానికులు,బాధితుని బంధువులు , సామాజిక మాధ్యమాల్లో చూసినవారు బండ్లగూడ పోలీసుల పనితీరును మెచ్చుకుంటు ప్రశంసలు కురిపిస్తున్నారు. హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ఇస్మాయిల్ నగర్ కు చెందిన క్యాబ్ డ్రైవర్ ఐజాజ్ జహంగీరబాద్ కు చెందిన ఖతిజ పరిచయిస్తులు, కొంతకాలంగా ఐజాజ్ ఖతిజను లైగింగా వేధిస్తున్నాడు, వేధింపులు ఎక్కువకావడంతో ఖతిజ తన భర్త,కొడుకు తో కలిసి ఐజాజ్ ను మాట్లాడుకుందాం అని పిలిపించుకుని అక్కడి నుండి భర్త,కొడుకు సహాయంతో అపహరించి ఆటోలో తీసుకెళ్తుండగా బాధితుడు ఐజాజ్ తన తల్లికి ఫోన్ చేసి తనను బలవంతంగా ఎత్తుకెళ్తున్నారు నన్ను చంపేస్తారు అని చెప్పాడు, వెంటనే 100డయల్ కు బాధితుడి తల్లి ఫోన్ చేసి విషయం తెలిపింది.

మైనార్టీ సంక్షేమ పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

మైనార్టీ సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాలను రీస్ట్రక్చర్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ పూర్తి చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇమామ్‌లకు, మౌజన్‌లకు రూ.10 వేలు, రూ.5 వేలు గౌరవ వేతనం ఇవ్వడానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మైనారిటీలకు లబ్ది జరిగేలా వ‌క్ఫ్‌ భూముల అభివృద్ధికి సూచనలు చేశారు. ప్రధాన మంత్రి జన్ వికాస్ కార్యక్రమం కింద మంజూరైన రూ.447 కోట్ల కు సంబంధించి పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మంజూరై కొంత మేర నిర్మాణాలు జరిగిన షాదీఖానాలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. ప్రారంభంకాని పనులను రద్దు చేసి పునః సమీక్ష చేయనున్నామని సీఎం తెలిపారు. వక్ఫ్ బోర్డు భూముల సర్వే రెండేళ్లలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి చిన్నారి మృతి

విజయవాడలోని అశోక్‌నగర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి ఏడాదిన్నర చిన్నారి మృతిచెందింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శనివారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ పడమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం టెంపుల్ కాలనీకి చెందిన మహమ్మద్ అబ్బాస్.. క్రేన్ హెల్పర్‌గా పని చేస్తున్నాడు. విజయవాడ అశోక్‌నగర్‌కు చెందిన మహిళతో నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి అయేషా, ఆఫియా అనే (18 నెలల) చిన్నారులు ఉన్నారు. ఈనెల 19న అబ్బాస్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో మచిలీపట్నం నుంచి విజయవాడ అశోక్‌నగర్‌లోని అత్తారింటికి వచ్చారు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఆఫియా ఆడుకుంటూ స్నానాల గదిలోకి వెళ్లింది. అక్కడ బాత్రూం శుభ్రం చేసే యాసిడ్ బాటిల్ కనిపించింది. సీసా మూత తీసి మంచినీళ్లు అనుకుని తాగేసింది. అనంతరం చిన్నారికి వాంతులు అవ్వడం ప్రారంభమయ్యాయి. తండ్రి అబ్బాస్ వెంటనే గమనించి ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. వైద్యులు వెంటనే వైద్యం ప్రారంభించినా ప్రయోజనం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్‌.. అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

న్యాయ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపుతామని సీఎం చంద్రబాబు చెప్పారు. 100 ఎకరాల్లో అమరావతిలో లీగల్ కాలేజ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నిందితులకు శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి పంపుతామని సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేర‌కు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మంత్రివ‌ర్గ స‌మావేశంలో ఈ మేరకు తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. రాజ‌ధాని అమరావతిలో 100 ఎకరాల విస్తీర్ణంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఇంటర్నేషన్ లా స్కూల్ ఏర్పాటును ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • cm chandrababu
  • CM Revanth Reddy
  • rahul gandhi
  • telugu news

తాజావార్తలు

  • Sonu Sood: రంగంలోకి హీరో సోనూసూద్.. దుబాయ్‌లో చిక్కుకున్న వారికి ఉచిత వసతి!

  • Puri jagannath temple: పూరి జగన్నాథుడి ఆలయంలో “బనకలగి” పూజ.. ఆ 4 గంటలు ఏం జరుగుతుంది.?

  • Rajahmundry Adulterated Milk: కల్తీ పాల ఘటన.. రోజురోజుకి పెరుగుతున్న మరణాలు!

  • OTT : మొత్తానికి ఓటీటీ రిలీజ్ కు వస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి

  • Varalaxmi:అబ్బాయిల చెడ్డీ కనిపిస్తే ఓకే.. అమ్మాయిల బ్రా స్ట్రాప్ కనిపిస్తే తప్పా?

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions