గాజా నగరంలోని ఓ పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో ఏడుగురు మృతి చెందారు. ఈ వ్యక్తులు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసమని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్నారు. కాగా.. ఈ ఘటనపై పాలస్తీనా అధికారులు సమాచారం ఇచ్చారు. అయితే.. పాఠశాల ఆవరణలో తలదాచుకున్న వారిని చంపేందుకు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది.
గిన్నీస్ బుక్ లోకి చిరంజీవి ఇప్పటికే సినిమాలు చేస్తూ కొన్నాళ్లపాటు రాజకీయాలు చేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కబోతోంది. మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకోబోతున్నారు. ఎక్కువ సినిమాల్లో డాన్స్ చేసి నటించినందుకుగాను మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ గా ఘనత దక్కించుకున్నారు. ఈ విషయాన్ని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాదులోని ఐటిసి…
ప్రపంచ వ్యాప్తంగా తిరుమలకు ఎంతో విశిష్టత ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పటి వరకూ పాలకులెవ్వరూ తిరుమల పవిత్రత దెబ్బతీసే సాహసం చేయలేదన్నారు. ఎందరికో స్పూర్తిదాయకమైన పవిత్ర క్షేత్రంలో 5ఏళ్లుగా అపవిత్ర కార్యక్రమాలు చేపట్టారని.. రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారన్నారు. రాజశేఖర్ రెడ్డి 7 కొండల్ని 2 కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామన్నారు.
రాష్ట్రంలో ప్రజారోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు కొత్తగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కీలక సమావేశం నిర్వహించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి టి రాజయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెటుకు ఆనంద్ ఉన్నారు. తెలంగాణలో క్షీణిస్తున్న ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేయడానికి , ప్రభుత్వానికి సహాయం చేయడానికి ఈ బృందం ఏర్పడింది , ఈ రోజు తన కార్యకలాపాలను ప్రారంభించింది.…
దులీప్ ట్రోఫీ 2024 టైటిల్ను ఇండియా 'A' కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్ల్లో ఇండియా ఏ రెండింట్లో విజయం సాధించగా.. ఒక మ్యాచ్లో ఓడిపోయింది. రెండు విజయాలతో ఈ జట్టు గరిష్టంగా 12 పాయింట్లను కలిగి ఉంది. దీంతో.. జట్టు ఛాంపియన్గా నిలిచింది. భారత్ సి 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. కాగా.. భారత్ ఎ జట్టు 61వ సారి దులీప్ ట్రోఫీ టైటిల్ గెలుచుకుంది.
అమీన్ పూర్లో చీకట్లో కూడా ఆగకుండా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కృష్ణారెడిపేటలో లైట్ల వెలుతురులో అక్రమ నిర్మాణాలను బాహుబలి మిషన్ కూల్చివేస్తోంది. అక్రమ నిర్మాణాన్ని ఆనుకుని ప్రక్కనే మరొక అపార్ట్మెంట్ ఉంది. అయితే.. ఆ అపార్ట్మెంట్ కు ఇబ్బంది కలుగకుండా కూల్చే ప్రయత్నం చేస్తున్నారు హైడ్రా అధికారులు.. పూర్తి నిర్మాణాలు కూల్చే వరకు హైడ్రా యాక్టివిటీ కొనసాగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. పటేల్ గుడా లో చివరి దశ…
ఈనెల 26న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలోని సన్నిహితులతో మాట్లాడి అందరం కలసి వెళ్తామన్నారు. గతంలోనే పలు సందర్భాల్లో మంచి వ్యక్తి అంటూ తన గురించి పవన్ మాట్లాడారన్నారు.
అల్లూరి జిల్లా మారేడుమిల్లి విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. మారేడుమిల్లి మండలం జలతరంగణి వాటర్ ఫాల్స్ వద్ద ఏలూరు ఆశ్రమ మెడికల్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు.
కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన చాలా బాగుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడుతూ.. ప్రజలు ఏం కోరుకున్నారో అలాంటి పాలన అందించగలిగామన్నారు.