Off The Record: ఆ ఎమ్మెల్యే అనవసరంగా వేలుపెట్టి కంపు చేసుకున్నారా..?
- కేరాఫ్ కాంట్రవర్శీ ఎమ్మెల్యే పంతం నానాజీ
- అడ్డగోలుగా మాట్లాడి చివరికి క్షమాపణలు
- రంగరాయ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌పై అనుచరుల దాడి
- ఎమ్మెల్యే అంత చిల్లరగా ఎలా మాట్లాడారు?
- సమర్ధించలేని పరిస్థితి అంటూ కూటమిలో చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: ఆ ఎమ్మెల్యే అడుసు తొక్కేసి కాలు కడుక్కోవడానికి, కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారా? పవర్ ఉంది కదా అని రెచ్చిపోయి నోటికి పని చెప్పిన శాసనసభ్యుడికి ఆ పవర్ కట్ చేస్తామంటూ పార్టీ పెద్దల నుంచి వార్నింగ్ వచ్చిందా? ఆయనగారి నోటి దురుసుపై సొంత పార్టీ నేతలు సైతం ఒక్కొక్కరే బయట పడుతున్నారా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన బూతు పురాణం?
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ… ముందూ వెనకా ఆలోచించకుండా మాట్లాడి ఇప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారిపోయిన లీడర్. కాలేజీ పిల్లలు వాలీబాల్ ఆడుకునే విషయంలో అనవసరంగా ఎంటరవడమేగాక… తానొక ప్రజా ప్రతినిధిని అన్న విచక్షణ మర్చిపోయి… నోటికి ఎంత మాటొస్తే అంత మాట అడ్డగోలుగా మాట్లాడేసి… చివరికి క్షమాపణలు చెప్పుకునేదాకా వచ్చారాయన. దీంతో అడుసు తొక్కనేల, కాలు కడగనేల అన్న మాటలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్యేని ఉద్దేశించి. డ్యాష్… డ్యాష్ అంటూ ఒళ్లూపొల్లూ తెలియకుండా మాట్లాడినప్పుడు ఈ బుద్ధిని ఎక్కడ మూటగట్టి పెట్టారంటూ ఎమ్మెల్యేని కార్నర్ చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. మాట్లాడకూడనిదంతా మాట్లాడేసి.. రచ్చ పెరిగాక సారీ చెప్పినా… అప్పటికే నష్టం జరిగిపోయింది. ఎమ్మెల్యే అనుచరులు రంగరాయ మెడికల్ స్టూడెంట్స్ పై దాడికి కూడా దిగడంతో మేటర్ ఇంకా సీరియస్ అయింది. పంతం నానాజీ స్థాయి మర్చిపోయి మరీ ఇంత చిల్లరగా ఎందుకు ప్రవర్తించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి స్థానికంగా. హుందాగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అనే విమర్శలు సైతం పెరుగుతున్నాయి.
Also Read
- Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
- MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
- LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
- Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
అసలు నానాజీకి ముందు నుంచి నోటి దురద ఎక్కువనే ప్రచారం ఉంది. గతంలో మాజీ ఎమ్మెల్యే పిల్లి దంపతులకు ఇండైరెక్టుగా చురకలు అంటించారు. బియ్యం దొంగలు, కొడుకులకు వంద పెళ్లిళ్లు చేసిన వాళ్ళు తనను విమర్శిస్తున్నారంటూ ఫైరవడం అప్పట్లో కలకలం రేపింది. దాంతో నానాజీ విషయాన్ని ఇప్పుడు ఎవరు సమర్థించలేని పరిస్థితులు వచ్చాయన్నది కూటమి పార్టీల నేతల మధ్య జరుగుతున్న చర్చ. మా ఎమ్మెల్యే గారు… ప్రతి విషయంలో ఓపెన్‌గా ఉంటారంటూ ఆయన సన్నిహితులు ఎన్ని కవరింగ్‌లు ఇచ్చుకుంటున్నా…అవతలి వాళ్ళకు అలా అనిపించక యవ్వారం బాగా ముదిరిందట. అసలు ఎంత ఓపెన్ అయితే మాత్రం…. అంతలా… వినకూడని, బండ బూతులు తిట్టడం పద్ధతేనా అన్నది ఎక్కువ మంది క్వశ్చన్. స్థానికంగా ఛోటా మోటా లీడర్స్ చూసుకునే విషయాల్లో సైతం పవర్ ఉంది కదా అని వేలు పెడితే… ఇలాగే కంపు కొడుతుందన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి కాకినాడ రాజకీయ వర్గాల నుంచి. ఒక ప్రభుత్వ డాక్టర్‌ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంపై జనసేన అధినేత కూడా సీరియస్ అయ్యారట.. ప్రవర్తన మార్చుకోకపోతే ఏం చేయాలో అదే చేస్తానంటూ నానాజీకి పవన్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. జనసేనలో గతంలో ఎప్పుడూ ఇటువంటి వివాదాలు లేవు. ఇప్పుడు నేరుగా ఎమ్మెల్యేనే అడ్డగోలుగా బూతులు మాట్లాడటంపై పార్టీ పెద్దలు కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు.అటు ద్వితీయ శ్రేణి నేతల్ని కూడా ఎమ్మెల్యే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారన్న కామెంట్స్ ఇప్పుడు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో కష్టపడి తనను గెలిపించిన ద్వితీయ శ్రేణి అన్నాకూడా నానాజీకి లెక్కాపక్కా లేదంటూ ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటపడుతున్నారట జనసేన నేతలు. ఒక్కోసారి అధికారులపై కూడా ప్రేలాపనలు ఉంటాయంటున్నారు. మొదటి సారి ఎమ్మెల్యే అయ్యి… ఇంత తల బిరుసుగా మాట్లాడినవాళ్లు ఎవ్వరూ లేరన్న టాక్ వినిపిస్తోంది నియోజకవర్గంలో.
ఏదో అనుకుంటే ఆయన ఇంకేదో చేసేస్తున్నారంటూ…. సొంత పార్టీలోనే లుకలుకలు బయటపడుతున్నట్టు తెలుస్తోంది.. అటు టిడిపి నుంచి కూడా ఇదే రకమైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. ఎమ్మెల్యే వైఖరి కారణంగానే… తాము ఆయనతో కనెక్ట్ అవ్వలేకపోతున్నామని టీడీపీ నాయకులు అంటున్నట్టు తెలిసింది. ఆయన ఇంట్లో మాట్లాడినట్లు పబ్లిక్ లైఫ్ లో మాట్లాడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారట. తీరు మార్చుకోకుంటే వెనకాల తిరిగే వాళ్ళు తప్ప ఎవరూ ఉండరన్న వాదన సైతం వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో తాము పని చేస్తుంటే ఈయన వ్యవహారం ఇబ్బందికరంగా ఉందని ఓపెన్ అయిపోతున్నారట ఎక్కువ మంది నేతలు. తప్పులు చేసి ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎందుకన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి కాకినాడలో. ఎమ్మెల్యే ముందే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని సెటైర్లు వేసే వాళ్ళు ఉన్నారట.. వయస్సు, హోదాకి తగ్గట్లు ప్రవర్తిస్తే పశ్చాత్తాపం ఎందుకన్నది లోకల్ వాయిస్. ఇప్పటికైనా ప్రజా జీవితంలో ఎక్కువ రోజులు ఉండాలనుకుంటే…. హోల్డ్ యువర్ టంగ్ అన్న సూచనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నానాజీ… యే క్యాహైజీ… అంటూ సెటైర్లు వేస్తున్నారు సొంత పార్టీ నేతలు. పార్టీ కల్చర్‌కు భిన్నంగా, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రవర్తించి కొత్త తలనొప్పులు తీసుకురావద్దని క్లారిటీ ఇస్తున్నట్టు తెలిసింది. ఈ విషయమై పార్టీ పెద్దలు ఇప్పటికే తలంటేశారని, తీరు మార్చుకోకపోతే ఎక్కడ కట్ చేయాలో అక్కడ చేసేస్తారని కూడా చెవులు కొరుక్కుంటోందట జనసేన కేడర్.
తాజావార్తలు
-
Tilak Varma: అక్కడ బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
-
MP Mithun Reddy: మా అభ్యర్థుల నామినేషన్లు తీసుకోవడం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ!
-
LPG Cylinder: పెరిగిన గ్యాస్ ఉత్పత్తి.. దసరాకు ముందు 14.2 కేజీల సిలిండర్ ధర ఎంత..?
-
Bhuvneshwar Kumar Record: భువనేశ్వర్ కుమార్ అరుదైన రికార్డు.. కానీ తీవ్ర నిరాశ..!
-
Harish Rao: రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గం..
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!