Off The Record: రాజ్యసభలో బలం పెంచుకునే ప్లాన్‌లో బీజేపీ.. అందుకోసమే..
- వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య
- ఆర్.కృష్ణయ్య పార్టీ మారతారన్న ప్రచారం
- బీజేపీ పెద్దలు కృష్ణయ్యతో టచ్‌లో ఉన్నారా?
- పార్టీ మారాలంటే ముందు రాజీనామా ముఖ్యం
- అంతా ఒకే జట్టుగా బీజేపీలోకి వెళ్ళే అవకాశం తక్కువ
- కృష్ణయ్య ఒక్కరే బీజేపీలోకి వెళ్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య బీజేపీ వైపు చూస్తున్నారా? లేక బీజేపీ అధినాయకత్వమే ఆయన్ని రా…రమ్మని పిలుస్తోందా? కారణం ఏదైనా… ఆయన కాషాయ కండువా కప్పుకుంటారా? ఆ విషయమై రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ నుంచి వైసీపీ తరపున పెద్దల సభకు వెళ్లిన కృష్ణయ్య పార్టీ మార్పుపై పదే పదే ఎందుకు ప్రచారం జరుగుతోంది?
బీజేపీకి ఇప్పటికీ రాజ్యసభలో తగినంత బలం లేదు. బిల్లుల్ని పాస్ చేయించుకోవడం కోసం ఇతర పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. అందుకే… ఓ వైపు ఖాళీ అవుతున్న స్థానాల్ని తమ కూటమి ఖాతాలో వేసుకునే ప్రణాళికలు రచిస్తూనే… మరోవైపు ఇతర పార్టీలకు చెందిన కొందర్ని తమ కూటమిలోకి లాగేసుకునే ప్లాన్‌కు పదును పెడుతోంది. ఎన్డీఏ పార్టీలకు అసెంబ్లీల్లో మెజార్టీ ఉన్న చోట వేరే పార్టీల రాజ్యసభ సభ్యులతో రాజీనామాలు చేయించి తిరిగి వాళ్ళనే తమ తరపున పెద్దల సభకు పంపే వ్యవహారం కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో ప్రభుత్వం మారాక వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఎక్కువ మంది పార్టీ మారతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇక తాజాగా బీసీ సంఘాల నేత, వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య విషయంలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన బీజేపీ కండువా కప్పుకుంటారన్న వార్తలు కలకలం రేపుతున్నాయి. కృష్ణయ్య సన్నిహితులు దీన్ని ఖండిస్తున్నా… ప్రచారం మాత్రం ఆగడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం ఆయనకు టచ్‌లో ఉందని, కృష్ణయ్య పుట్టిన రోజున పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు ఫోన్‌చేసి విషెస్ చెప్పడంతో పాటు ఇతర విషయాలు కూడా మాట్లాడారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో.
Also Read
- Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
- 180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
- Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
- IMD Weather Alert: దక్షిణాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. కేరళ, తెలంగాణ జిల్లాలకు ఐఎమ్‌డీ హై అలర్ట్
ఒక వేళ ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరాలంటే వైసీపీ ఎంపీగా రాజీనామా చేయాలి. అలా కాదంటే… వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది ఒకే జట్టుగా బీజేపీలోకి వెళ్ళి తమను ప్రత్యేక వర్గంగా గుర్తించమని ఛైర్మన్‌ను కోరవచ్చు. అప్పుడైతే వాళ్ళకు ఫిరాయింపుల చట్టం వర్తించదు. కానీ… ఇక్కడే అసలు తిరకాసు ఉంది. వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కృష్ణయ్య ఒక్కరే తెలంగాణకు చెందిన నేత. మిగతా 99 శాతం ఆంధ్రప్రదేశ్ నాయకులే. ఒకవేళ అంతా కలిసి మూడింట రెండు వంతుల చొప్పున వెళ్ళాలంటే… ఆప్షన్‌గా టీడీపీ లేదా జనసేనను ఎంచుకుంటారు తప్ప… బీజేపీలోకి వెళ్ళరన్న వాదన ఉంది. అలాంటప్పుడు కృష్ణయ్య ఒక్కరే బీజేపీలోకి వెళ్తారా? అన్న చర్చ సైతం జరుగుతోంది. ఆయన పదవీ కాలం ఇంకా నాలుగేళ్ళు ఉంది. ఈ పరిస్థితుల్లో…. ఒక వేళ బీజేపీ పెద్దలు ఆయన్ని రమ్మని కోరినా… కాషాయ కండువా కప్పుకోవడం అంత తేలిక కాదన్న వాదన వినిపిస్తోంది. కృష్ణయ్య బీజేపీలో చేరతారని గతంలో కూడా రెండు సార్లు ప్రచారం జరిగింది. ఆయన ఖండించారు. అయినా సరే… ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఆయన బీజేపీ ఎంట్రీపై చర్చ జరుగుతోంది. దీంతో ఈసారి ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు.
తాజావార్తలు
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
-
Vijayawada SAAP Office: శాప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. వైసీపీ నేతలపై పోలీసుల లాఠీఛార్జ్!
-
Ganesh Nimarjan: నది లేకుండా గణేష్ నిమజ్జనం? ఎలా చేయాలి? పర్యావరణాన్ని ఎలా కాపాడాలి?
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు కోర్టు అనుమతి
ట్రెండింగ్
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!