విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు.
అటవీప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినప్పుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషి ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు.
మహిళా,శిశు సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఫౌండేషన్ స్కూల్లో చిన్నారులకు బోధనపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ప్రత్యామ్నాయ బోధనా విధానాలపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు.
అమరావతి అసైన్డ్ భూముల కొనుగోళ్లపై చంద్రబాబు, నారాయణపై నమోదైన సీఐడీ కేసులపై ఏపీ హైకోర్టు తుది విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీఐడీ కీలక వాదనలు వినిపించింది. కేవలం అమరావతిలో ఎస్సీల దగ్గర ఉన్న భూములను తక్కువకు బినామీలతో నారాయణ కొనుగోలు చేయించారని సీఐడీ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఏపీ, తెలంగాణ) వీఎం.రెడ్డి (ఎయిర్ కమోడోర్) కలిశారు. విపత్తు నిర్వహణలో ఎన్సీసీ క్యాడెట్ల పాత్ర, బాధ్యతలు, ప్రజలకు అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది.
కట్టుకున్న ఇల్లాలిని కర్కశంగా హతమారుస్తున్న భర్తల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. దెయ్యం పట్టిందనే నెపంతో భార్యను భర్త కిరాతకంగా కొట్టి చంపిన ఘటన ఆంధ్రప్రదేశ్లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో చోటుచేసుకుంది.
ప్రజలు అవయవ దానానికి ముందుకు రావాలని జీవన్ దాన్ ఇంచార్జి డాక్టర్ జి. స్వర్ణలత పిలుపునిచ్చారు. దేశంలో అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారు చాలామంది ఉన్నారని, మరణించిన వ్యక్తి అవయవ దానం చేస్తే 8 నుంచి 9 మంది ప్రాణాలు కాపాడవచ్చన్నారు.
మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శలు గుప్పించారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడే ప్రాజెక్టు పనులు ముందుకు సాగాయన్నారు.
ఈ నెల 9న మహబూబ్ నగర్ లోని శిల్పారామంలో TASK నేతృత్వంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మహబూబ్ నగర్ లోని I.T టవర్ లో ఉన్న కంపెనీలకు ఐటీ ఉద్యోగుల కోసం ఈ జాబ్ మేళా. లోకల్ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని, పాలమూరు.. మట్టి మోసే లేబర్ నుంచి నేడు ఐటీ ఉద్యోగుల దాకా వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news, srinivas…