మీకు చేతగాక కేంద్రాన్ని బదనాం చేస్తారా? అంటూ బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పంట నష్టంపై కేంద్ర వివరాలెందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్డీఆర్ఎఫ్ కింద సాయం చేసిన 3 వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయలేదు? ఆ నిధుల ఖర్చుపై వివరాలను ప్రకటించే దమ్ముందా?యాసంగి వరద సాయం ఏమైంది?రైతులేమైనా బిచ్చగాళ్లనుకుంటున్నవా?… ప్రతిసారి యాచించాలా? ఫసల్ బీమా స్కీంను విమర్శిస్తున్న మీరు… 9 ఏళ్లుగా సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టలేదు? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Teacher Harassment : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవర్తించిన కీచకుడు
అంతేకాకుండా.. రైతు బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థలకు ఎన్ని నిధులిచ్చారు? చనిపోయిన కుటుంబాలకు ఎంత సాయం చేశారు?తక్షణమే శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ఆయన అన్నారు. ఆర్టీసీ విలీనాన్ని స్వాగతిస్తున్నాం… విలీనం పేరుతో కార్మికులకు అన్యాయం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి బీజేపీని బదనాం చేయాలనుకుంటారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ ఎన్నికల స్టంట్… 4 ఏళ్లుగా ఎందుకు అమలు చేయలేదని ఆయన అన్నారు. ఒక్కో ఎకరాకు మోడీ ప్రభుత్వం 30 వేల సాయం అందిస్తోందని, రైతుకు బీఆర్ఎస్ ఎంత సాయం చేస్తుందో చెప్పాలని ఆయన అన్నారు.
Also Read : Teacher Harassment : విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రవర్తించిన కీచకుడు