Earthquake: శనివారం బంగాళాఖాతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన సమాచారం మేరకు.. శనివారం మధ్యాహ్నం 2:39 గంటలకు భూకంపం సంభవించింది. సముద్రం లోపల 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించడంతో ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read: Anju Nasrullah Love Story: అంజు కేసులో కొత్త ట్విస్ట్.. అంజు, నస్రుల్లాపై అరవింద్ పోలీసులకు ఫిర్యాదు
ప్రకంపనలపై అధ్యయనం చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే సముద్ర అలలను పరిశీలిస్తున్నామని ఐఎండీ అధికారి తెలిపారు. ముందస్తుగా సునామీపై ఎలాంటి అంచనా వేయలేమని, హెచ్చరికలు జారీ చేయలేమని చెప్పారు.