రాష్ట్రంలో ఏదో రకంగా అల్లర్లు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నం
రాష్ట్రంలో అలజడులు సృష్టించడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆరోపించారు. చంద్రబాబు ముందస్తు వ్యూహం ప్రకారమే పుంగనూరులో అలజడులు జరిగాయని అన్నారు. పోలీసులపై రాళ్ళ దాడికి చంద్రబాబే ఉసి గొల్పి రక్తపాతం సృష్టించారని ఆయన ఆరోపించారు. ముందు ఇచ్చిన రూట్ ప్రకారం కాకుండా మరో రూట్ లో వెళ్తామని చంద్రబాబు అనడంతో పోలీసులు అడ్డుకున్నారని ఎంపీ మార్గానీ చెప్పారు.
చిత్తూరు జిల్లా పుంగనూరులో టీడీపీ శ్రేణులు దాడులను ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. పోలీసులపై దాడి చేయించడం అమానుషం.. చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెబుతారు.. టీడీపీ శ్రేణుల దాడులు ప్రీ ప్లాన్డ్ స్కెచ్ గా కనిపిస్తుంది అని ఎంపీ భరత్ ఆరోపించారు. అనుమతి ఉంటే పోలీసులు ఎక్కడా ఆపరు.. యువతను, కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు వ్యవహరించారు.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి.. తన పబ్బం గడుపుకోవాలని చంద్రబాబు భావించారు.. చంద్రబాబువి పాతతరం రాజకీయాలు.. ఆయన చిప్ అప్డేట్ చేసుకోవాలని రాజమండ్రిం ఎంపీ అన్నారు.
సానుభూతి కోసం ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు
నిన్న( శుక్రవారం ) చంద్రబాబు అన్నమయ్య జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, దాడులు.. యుద్ధవాతావరణాన్ని తలపించాయి. పోలీస్ వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టడమే కాకుండా.. వారిపై దాడులకు కూడా దిగారు. ఆందోళనకారుల దాడుల్లో కొందరు పోలీసులకు గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే.. ఈ ఘటనపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. పుంగనూరు ఘటనపై ఆమె గుప్పించారు.
పోలీసులపై టీడీపీ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ హోంమంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులపై దాడి చేయడం అమానుష చర్య అని ఆమె తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు అని హోంమంత్రి పేర్కొన్నారు. పుంగనూర్ ఘటనలో 13 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ఆమె వెల్లడించారు.
నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నా
టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ కోరారు. ‘‘ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు. అయితే.. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదన్నారు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నానని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నానని గవర్నర్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నానని, ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయన్నారు. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగామని, నేను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ ను అన్నారు.
విజయ్, సమంత ‘ఖుషి’ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్.. సెన్సార్ కూడా పూర్తి!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ఫుల్ లెంగ్త్ ప్రేమ కథతో వస్తున్న ఈ సినిమాను శివ నిర్వాణ తెరకెక్కించాడు. ఖుషి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించారు. సెప్టెంబరు 1న తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఖుషి సినిమాపై విజయ్‌తో పాటు ప్రేక్షకులు కూడా భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఖుషి సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుటోంది. సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతుండంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలెట్టింది. ఈ క్రమంలోనే ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది. ఖుషి ట్రైలర్‌ను ఆగస్టు 9న విడుదల చేస్తున్నారు. ఈ ట్రైలర్ సెన్సార్ పూర్తయినట్లు హీరో విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఖుషి ట్రైలర్ నిడివి 2 నిమిషాల 41 సెకండ్స్ ఉందని రౌడీ హీరో పేర్కొన్నాడు.
ఏం ఐడియా రా బాబు.. చీరకు గోల్డ్ స్ప్రే చేసి స్మగ్లింగ్
ఎర్రచందనం, జంతువుల చర్మాలు, డ్రగ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే దొంగ రవాణాలో దేశం దాటుతున్న, దేశంలోకి వస్తున్న వస్తువులు ఎన్నో, వాటి కోవలోకే వస్తుంది బంగారం కూడా, దొంగరవాణాని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండట్లేదు. మనసుంటే మార్గాలు ఎన్నో ఈ సూక్తిని ఎవరు పాటించిన లేకున్నా స్మగ్లర్లు మాత్రం తూచా తప్పకుండ పాటిస్తున్నారు, అందుకు శంషాబాద్ విమానాశ్రయం సంఘటనే ఉదాహరణ.
శుక్రవారం దుబాయి నుండి వచ్చిన ఒక ప్రయాణికుని వద్ద 461 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారం విలువ 28.01 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు లెక్కకట్టారు. అధికారులకి దొరకకుండా ఉండేందుకు స్మగ్లర్ చీరకి బంగారు స్ప్రే చేసానని చెప్పగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయడంతో స్మగ్లర్ దొరికాడని అతన్ని అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నాం అని కస్టమ్స్ అధికారులు తెలియచేసారు. ఇలాంటి సంఘటనలు దేశంలో పలుచోట్ల చోటు చేసుకుంటూనే ఉన్నాయి. బంగారం రవాణాకు స్మగ్లర్ ఎన్నుకునే మార్గాలలో విమానాశ్రయం మొదటి స్టానంలో ఉంటుంది. కానీ, ప్రస్తుతం విమానాశ్రయాలలో ఉన్న పటిష్టమైన తనిఖీ వ్యవస్థ కారణంగా ఇలాంటి ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్న, చేసేది తప్పని పట్టుబడితే శిక్ష తప్పదని తెలిసిన స్మగ్లర్లు మాత్రం వాళ్ళ తీరుని మార్చుకోవడం లేదు.
కొడుకు మృతిని తట్టుకోలేక ఆగిన తండ్రి గుండె..
అమ్మ ప్రేమ కనిపిస్తుంది.. నాన్న ప్రేమ కనిపించదు కానీ నడిపిస్తుంది. పిల్లలే తమ ప్రపంచంగా బ్రతుకుతూ.. ఆ పిల్లల ఇష్టాల కోసం కష్టాన్ని కూడా సంతోషంగా భరిస్తున్న తండ్రులేందరో ఉన్నారు. తన పిల్లలకి చిన్న కష్టం వస్తేనే తల్లడిల్లిపోయే వ్యక్తి నాన్న.. అలాంటిది చెట్టంత కొడుకు ఇక లేడు.. ఎప్పటికి రాడని తెలిస్తే..? ఆ తండ్రి గుండె తట్టుకోగలదా..? గుండె చప్పుడు ఆగిపోయిన పోవచ్చు, ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
అయితే, సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని గొంగ్లూర్ తండాలో నివాసం ఉంటున్న బీమ్లా అనే వ్యక్తి ఆందోల్ మండలం అన్నాసాగర్ దగ్గర రోడ్ ప్రమాదం జరగడంతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ విషయం తెలిసిన బీమ్లా తండ్రి తట్టుకోలేక పోయారు, చేతికొచ్చిన కొడుకు తన కళ్ళముందే నిర్జీవంగా పడి ఉండటంతో చూసి జీర్ణించుకోలేని బీమ్లా తండ్రి ధర్మా నాయక్ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి పోయారు. ఒకే రోజు గంటల వ్యవధిలో తండ్రి కొడుకులు ఇద్దరు మృతి చెందడంతో పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ధర్మా నాయక్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇక తండ్రికొడుకులు ఒకేసారి చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా..?
అమరావతిలో ఎన్ఆర్ఐ జనసేన గల్ఫ్ విభాగం సభ్యులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. పార్టీకి ఎన్ఆర్ఐ గల్ఫ్ విభాగం కోటి రూపాయల విరాళం అందచేసింది. కౌలు రైతు భరోసా యాత్ర నిమిత్తం మరో రూ. లక్షా 10 వేల విరాళంగా ఇచ్చారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. రౌడీయిజం చేయగలిగినవాడే రాజకీయ నాయకుడు అనుకోవాలా? అని ఆయన అన్నారు. కరడుగట్టిన చట్టాలున్న దేశంల్లో బతకొచ్చు.. ఇక్కడ మాత్రం బతకలేని పరిస్థితులు కల్పించారు. రాష్ట్రంలో కౌన్సిలర్ కూడా బెదిరించేస్తాడు.. అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అని పవన్ కల్యాణ్ అన్నారు.
మన దేశంలో మనకున్న స్వేచ్ఛ కోల్పోకూడదన్నదే నా లక్ష్యం అని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. రూల్స్ పాటించాలి.. అన్యాయం జరుగుతున్నప్పుడు బలంగా ఎదిరించాలి.. అలాంటి రాజకీయ వ్యవస్థను తీసుకురావాలన్నదే నా లక్ష్యం అని పవన్ కల్యాణ్ తెలిపారు. విదేశాల్లో ఉన్నవారంతా తిరిగి స్వదేశానికి వచ్చే పరిస్థితులు కల్పించాలి.. కుల దూషణలు చేసే వారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారే రాజకీయ నాయకులుగా ఉన్నారు.. ఇలాంటి పరిస్థితులన్నింటినీ అధిగమించి ఒక తరం కోసం నా ఆఖరి శ్వాస వరకు నా నేల కోసం పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని జనసేనాని తెలిపారు.
మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలం
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాసనమండలిలో గిరిజన సంక్షేమంపై జరిగిన లఘ చర్చలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. మణిపూర్ లో రెండు గిరిజన తెగల మధ్య కొట్లాట పెట్టించి చలి కాచుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లను కట్టడి చేయడంలో కేంద్రం విఫలమైందని ఆమె అన్నారు. విభజించి పాలించి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ఆమె ఆరోపించారు. బ్రిటీషర్లు మెదలు పెట్టింది.. బీజేపీ ఫాలో అవుతుందని, కల్యాణలక్షి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి పథకాలతో గిరిజన ఆడబిడ్డలకు ప్రయోజనమన్నారు. 4 లక్షల 5వేల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసామన్న ఎమ్మె్ల్సీ కవిత.. లక్షా యాభై వేల మంది గిరిజనులకు పోడు పట్టాలు ద్వారా లబ్ధి చేకూరిందన్నారు.
ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి.. కేసీఆర్ సర్కార్ నినాదమని, గిరిజనులకు రూ.1336 కోట్లు కళ్యాణ లక్ష్మీ కోసం నిధులు ఖర్చు చేసినట్లు ఆమె వెల్లడించారు. ఎస్టీలకు కేటాయించిన నిధులు ఎస్టీలకే ఖర్చు చేయటానికి కేసీఆర్ 2017లో ప్రత్యేక చట్టం తీసుకొచ్చారని, ఆదివాసీ భవన్‌తో పాటు.. కొమురం భీం పేరుతో జోడే ఘాట్‌ను అభివృద్ధి చేసుకున్నామన్నారు. రూ.22 కోట్లతో హైదరాబాద్‌లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మించుకున్నామని, తెలంగాణకు ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు కేంద్రం ఇవ్వటం లేదన్నారు కవిత.
ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నారు
చిత్తూరు జిల్లా పుంగనూరు ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. పుంగనూరు ఘటనకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అంటూ ఆయన విమర్శించారు. బైపాస్ లో వెళతాం అని పోలీసులకు రోడ్ మ్యాప్ ఇచ్చారు.. ఆ తరువాత ఉన్నపళంగా పుంగనూరు టౌన్ లోకి వెళ్ళాలని చూసారు.. ఉన్నట్టుండి రూటు మారితే చంద్రబాబుకు ఏమైన జరుగుతుందన్న భయంతో పోలీసులు ఒప్పుకోలేదు.. అయన టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టి పోలీసులపై దాడికి ప్రేరేపించారు అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.
కాన్వాయ్ లో వచ్చేప్పుడు టీడీపీ నేతలు తుఫాకులు, రాళ్ళు తెచ్చుకున్నారు అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. మరి గవర్నర్ కి ఏమని ఫిర్యాదు చేశారు.. టీడీపీ వారు పోలీసులను కొట్టారని.. రాష్ట్రంలో రాజకీయంగా ఇక పోటీ పడలేమని ఇలాంటి వాటికి చంద్రబాబు తెరలేపారు.. ఇలాంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే.. కాలేజీ సమయం నుంచి చంద్రబాబుకి నన్ను టార్గెట్ చేశారు.. మా ప్రాంతంలో మూడు ప్రాజెక్టులు నిర్మాణం చేపడితే.. కేసులు వేసి ఆ నిర్మాణాలు ఆయన ఆపివేశారు అని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. హంద్రీనీవా పనులు చేసేది ఎన్సీసీ కంపెనీ.. అది కూడా మాపై నింద మోపాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
ఆలయంలోకి వితంతు మహిళల ప్రవేశంపై నిరాకరణ.. హైకోర్టు సీరియస్
వితంతువులను దేవాలయంలోకి ప్రవేశించకుండా నిరోధించడం వంటివి చట్టాల ద్వారా పరిపాలించబడే ఈ నాగరిక సమాజంలో జరగవని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. స్త్రీకి తనకంటూ ఒక గుర్తింపు ఉందని స్పష్టం చేసింది. ఒక వితంతు స్త్రీ ఆలయంలోకి ప్రవేశించడం వంటి ప్రాచీన విశ్వాసాలు రాష్ట్రంలో ప్రబలంగా ఉండటం చాలా దురదృష్టకరమని హైకోర్టు వ్యాఖ్యానించింది. తంగమణి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఆగస్టు 4 నాటి తన ఉత్తర్వుల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈరోడ్ జిల్లాలోని నంబియూర్ తాలూకాలో ఉన్న పెరియకరుపరాయణ్ దేవాలయంలోకి ప్రవేశించడానికి తనకు, తన కుమారుడికి రక్షణ కల్పించాలని ఆమె పోలీసులను కోరింది. వితంతు మహిళలను ఆలయంలోకి అనుమతించడం లేదని మద్రాసు హైకోర్టు తీవ్రంగా మందలించింది.
వితంతువు ఆలయంలోకి ప్రవేశిస్తే అపవిత్రత వస్తుందన్న ప్రాచీన విశ్వాసం రాష్ట్రంలో నెలకొనడం చాలా దురదృష్టకరమని న్యాయమూర్తి జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ అన్నారు. సంస్కర్తలు ఈ అనవసరమైన నమ్మకాలన్నింటినీ విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఈ ఆచారం కొనసాగుతోంది. ఇవి మనిషి తన సౌలభ్యం కోసం తయారు చేసుకున్న సిద్ధాంతాలు, నియమాలు ఆమె తన భర్తను కోల్పోయిన కారణంగా స్త్రీని అవమానించడం చాలా తప్పని కోర్టు పేర్కొంది. న్యాయవ్యవస్థ పాలనలో ఉన్న నాగరిక సమాజంలో ఇవన్నీ ఎప్పటికీ కొనసాగవని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ అన్నారు. పండుగలో పాల్గొనకుండా మహిళను ఎవరూ ఆపలేరని మద్రాసు హైకోర్టు తెలిపింది. మహిళను బెదిరిస్తున్న వారిని పిలిపించి , ఆమె కుమారుడిని ఆలయంలోకి రాకుండా , ఉత్సవాల్లో పాల్గొనకుండా అడ్డుకోలేమని స్పష్టంగా తెలియజేయాలని గోబిచెట్టిపాళయం పోలీసులను కోర్టు ఆదేశించింది .ఇంత జరిగినా శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తే వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని కోర్టు పేర్కొంది. ఆగస్టు 9, 10 తేదీల్లో జరిగే ఉత్సవాల్లో పిటిషనర్‌తోపాటు అతని కుమారుడు కూడా పాల్గొనేలా పోలీసులు చూడాలని ఆదేశించింది.
చంద్రబాబు వల్లే పుంగనూర్ లో గొడవ జరిగింది..
మాజీ సీఎం చంద్రబాబు నాయుడి కనుసన్నల్లోనే పుంగనూరులో గొడవ జరిగిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు పర్యటనలో ప్రసంగించిన తీరు వివాదస్పదంగా మారింది అని.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన కామెంట్స్.. ప్రజలని రెచ్చగొట్టేలా ఉన్నాయని మంత్రి బొత్స ఆరోపించారు. పుంగనూరు పర్యటనలో మాటలతో మొదలైన వివాదం చివరకు కొట్టుకునే స్థాయికి చేరింది అని మంత్రి తెలిపారు. అయితే, పుంగనూరు పర్యటనలో చంద్రబాబు మాట్లాడిన పదజాలం, ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన కామెంట్స్ విన్నవారికి చంద్రబాబు సహనాన్ని కోల్పోయారా? అన్నట్లు ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని మంత్రి బొత్స అన్నారు. చంద్రబాబు అల్లర్లు సృష్టించడం దుర్మార్గపు చర్య, నువ్వు అందరిలానే ఒక నాయకుడివే అనే విషయాన్నీ మర్చిపోవద్దు, నువ్వేమన్న పుడింగివనుకుంటున్నావా?.. అల్లర్లు సృష్టించడం రాజకీయంగా మంచి సంస్కృతి కాదు అని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజలని రెచ్చగొట్టి, పోలీసులపైన అనుచిత వ్యాఖ్యలు చేసి ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో అల్లర్లు సృష్టించిన చంద్రబాబు పైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
పవన్ కళ్యాణ్, చంద్రబాబులపై కేఏ పాల్ హాట్ కామెంట్స్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారహి యాత్ర అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి.. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు.. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా..? అని కేఏ పాల్ అడిగారు. విభజన హామీల కోసం కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు అని ఆయన అడిగారు. దశావతారంలాగా పవన్ కళ్యాణ్ పది పార్టీలు మార్చారు.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి.. ప్రజాశాంతి పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తాను అని పాల్ తెలిపారు.
వారాహి యాత్రకు వెళ్తే 500 ఇస్తున్నారు.. చంద్రబాబు యాత్రకు వెళ్తే 1000 రూపాయలు ఇస్తున్నారు అని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అయిన పవన్ సభలకు జనాలు రావడం లేదు.. చంద్రబాబు పులివెందుల వెళ్లి 50 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నేను పులిని అని చెప్పుకుంటున్నారు.. చంద్రబాబు పులి కాదు పిల్లి.. కేసీఆర్ తరిమేస్తే భయపడి అమరావతి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని కేఏ పాల్ విమర్శించారు. లోకేష్ పప్పను సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు అని కేఏ పాల్ ఎద్దేవా చేశాడు.
టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి..
తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. ఈమేరకు ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వైవీ సుబ్బారెడ్డి స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి పని చేశారు.2006-2008 మధ్య టీటీడీ చైర్మన్‌గా భూమన పనిచేశారు. టీటీడీ ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల పాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు. తనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కరుణాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు.
అయితే, ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పూర్తి స్థాయిలో రాజకీయ వ్యవహారాలు చూడనున్నారని సమాచారం. వైవీ సుబ్బారెడ్డిది ఈ నెల పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. ప్రస్తుత చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి 2019లో ఆ బాధ్యతలు చేపట్టారు. ఇక ప్రస్తుతం చైర్మన్‌తో పాటు టీటీడీలో 35 మంది పాలక సభ్యులు ఉన్నారు. ఇప్పుడున్న చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీకాలం ఇంకో వారం రోజుల్లో ముగియనుంది.
విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన కీచకుడు
రోజు రోజుకు కామాంధులు రెచ్చిపోతున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ హోదాలో ఉన్న వ్యక్తి తన విద్యార్థులపై కన్నేసాడు. కామంతో వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్‌లోని అత్తాపూర్ ఎస్‌ఆర్ డీజీ స్కూల్ లో 8 తరగతి విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తించాడు పీఈడీ టీచర్ విష్ణు. విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించి, దురుసుగా ప్రవర్తించడమే కాకుండా.. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టేవాడు. అయితే.. విద్యార్థిని ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో.. . స్కూల్ వద్దకు విద్యార్ధిని తల్లిదండ్రులు చేరుకున్నారు. స్కూల్ లో ఉన్న ఫర్నీచర్ ధ్వంసం చేసి, కంప్యూటర్ రూమ్ ను పగలగొట్టారు తల్లిదండ్రులు వారి బంధువులు.