టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియకు సంబంధించిన బిల్లులో ఐదు అంశాలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వివరణ కోరారు. ‘‘ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్ల వివరాలు లేవు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎలా కాపాడుతారు? ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పింఛన్ ఇస్తారా? విభజన చట్టం ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై వివరాలు లేవు. పదోన్నతులు, క్యాడర్ నార్మలైజేషన్‌లో న్యాయం ఎలా చేస్తారు?’’ అని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ కార్మికుల భద్రత, ప్రయోజనాలపై స్పష్టమైన హామీలను తమిళిసై కోరారు. అయితే.. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. నిన్న బిల్లు పంపి ఇవ్వాళ సంతకం కావాలంటే కరెక్ట్ కాదన్నారు. నేను ఆర్టీసీ కార్మికుల భవిష్యత్ కోసమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నానని గవర్నర్ క్లారిటీ ఇచ్చారు. ఏ బిల్లులోలైనా నిబంధనల ప్రకారమే నేను వెళ్తున్నానని గవర్నర్ తెలిపారు. రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాన్ని క్లారిటీ అడుగుతున్నానని, ప్రతీ బిల్లుకు కొన్ని రూల్స్ ఉంటాయన్నారు. కార్మికులకు వివిధ రూపాల్లో రావాల్సిన బకాయిలు, నిధుల గురించి ప్రభుత్వాన్ని అడిగామని, నేను పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్ ను అన్నారు.
Also Read : Chris Jordan: ఇదేం బ్యాటింగ్ రా సామీ.. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఊచకోత
బిల్లుపై రాజ్ భవన్ ఆఫీస్ కు ఎలాగైతే నిరసనగా వచ్చారో.. ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయండని, రాజ్ భవన్ కు నిరసనగా కార్మికులు వచ్చినందుకు నేనేం బాధపడటం లేదన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్…హెల్త్ బెనిఫిట్స్ పై ముసాయిదాలో స్పష్టత లేదని, మీరు భవిష్యత్ హక్కుల కోసం అడగటం న్యాయమే కానీ బకాయిల విషయంలో మీ పోరాట స్ఫూర్తిని ఎందుకు ప్రశ్నించడం లేదు? అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఆర్టీసీ కార్మికుల కోసమే ఉన్నా…మీ హక్కుల కోసమే అడుగుతున్నా ప్రాధాన్యత క్రమంలో మీ సమస్యలను పరిష్కరించేందుకు ముందుండాలని అడుగుతున్నానని, బిల్లులో స్పష్టత లేవని గవర్నర్ అడుగుతున్నట్లు…ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లండన్నారు. బాధ్యతాయుత గవర్నర్ వ్యవస్థలో భాగంగానే… నేను మీ న్యాయమైన అంశాల విషయంలో స్పష్టత కోసమే ఆపిన…అంతే తప్ప ఇంకో ఉద్దేశం లేదని, భవిష్యత్ ఎలాంటి సమస్యలు రాకుడదనే ..బిల్లులో స్పష్టత కోరుతున్నానని వెల్లడించారు.
Also Read : Health Tips: డిస్పోజబుల్ కప్పుల్లో తాగుతున్నారా? ప్రాణాలు పోయినట్లే..