ఛలో విధ్యుత్ సౌద మరియు మహాధర్నా సందర్భంగా విజయవాడలోని హోటల్స్, లాడ్జ్ లను ఎన్టీఆర్ జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈనెల 8న చలో విద్యుత్ సౌధ పిలుపు నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
అధికారిక లాంచనాలతో గద్దర్ అంత్యక్రియలు రేపు మహాబోధి విద్యాలయంలో జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
బీజేపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి మణిపూర్‌లో ఎన్డీఏ మిత్రపక్షం కుకీ పీపుల్స్ అలయన్స్ (కేపీఏ) మద్దతు ఉపసంహరించుకుంది. కుకీ పీపుల్స్ అలయన్స్(కేపీఏ) అధ్యక్షుడు టోంగ్‌మాంగ్ హౌకిప్ మణిపూర్ గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల అభ్యర్థుల చివరి లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి. మొత్తం 587 ఎస్సై పోస్టులకు గాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసినట్లు ప్రకటించింది. కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్లో ఉంచుతామని వెల్లడించింది.…
ఛత్తీస్‌గఢ్‌లోని ఉక్కు ఫ్యాక్టరీలో ఆదివారం పేలుడు సంభవించి కార్మికుడు కాలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. రస్మారాలోని రాయ్‌పూర్ స్టీల్ ప్లాంట్‌లో స్టీల్‌ను కరిగించే పని జరుగుతుండగా పేలుడు సంభవించింది.
ఆఫ్రికాలోని మొరాకో దేశంలో అత్యంత ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మొరాకోలోని అజిలాల్ సెంట్రల్ ప్రావిన్స్‌లో జరిగిన అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదంలో 24 మంది మరణించారని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ సర్వీసుల బిల్లు-2023ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రేపు(సోమవారం) రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలకు సంబంధించిన అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్‌కు బదిలీ చేసే ఆర్డినెన్స్ స్థానే కేంద్రం ఇటీవల తీసుకు వచ్చిన బిల్లును విపక్ష ఎంపీల ఆందోళన మధ్య లోక్‌సభ ఆమోదించిన సంగతి తెలిసిందే.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈరోజుతో ముగియనున్నాయి. అయితే.. ఈ రోజు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రతిపక్షాలు విసిరిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే ఏడెనిమిది సీట్ల ఆధిక్యంతో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ అన్నారు.. breaking news, latest news, telugu news, cm kcr, telangana assembly sessions