IND vs WI: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ జరుగుతోంది. కీలకమైన ఈ మూడో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. భారత్‌కు 160 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇచ్చింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 42 పరుగులు చేసి రాణించగా.. చివరలో విండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 19 బంతుల్లో 40 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు.
Also Read: Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర రెండో దశ ప్రకటించిన కాంగ్రెస్.. ఈ సారి యాత్ర ఎక్కడి నుంచంటే?
విండీస్ జట్టులో ఓపెనర్లు బ్రాండన్ కింగ్ 42, కైల్ మేయర్స్ 25 పరుగులు చేసి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ఎడాపెడా బాదుడు మొదలుపెట్టినా, టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లో జాన్సన్ చార్లెస్ (12), పూరన్ లను అవుట్ చేసి విండీస్ జోరుకు కళ్లెం వేశాడు. పూరన్ 12 బంతుల్లో 20 పరుగులు చేశాడు. మొదట్లో విండీస్‌ను కట్టడి చేసిన భారత బౌలర్లు చివరలో కాస్త ఇబ్బంది పడ్డారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ మూడు వికెట్లు తీయగా.. ముకేష్ కుమార్, అక్షర్ పటేల్‌లు తలా ఒక వికెట్ తీశారు.