టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పోలవరంలో పర్యటించి పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. అయితే.. ఈ సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేతలు భగ్గుమంటున్నారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ.. పోలవరం వచ్చి చంద్రబాబు నోటికి వచ్చినట్లు అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అమరావతి ఒక కన్ను, పోలవరం ఒక కన్ను అని అన్నాడని, ఈ రెండు ప్రాజెక్టుల పై ఎంత కొట్టేద్దాం అనుకున్నాడో అందుకే అంత బాధపడుతున్నారంటూ ఆయన విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నారాసుడు.. గూండాలు, రౌడీలను చంద్రబాబు ప్రోత్సాహిస్తున్నాడంటూ ఆయన ఆరోపించారు.
Also Read : Weight Loss Tips : రోజూ కీరాను ఇలా తీసుకుంటే చాలు.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
ఒక ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలో అస్థిరత సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడని కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు అందిస్తుంటే ప్రతిపక్ష పార్టీల వాళ్లే ఆశ్చర్యపోతున్నారని, రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆలోచన చేసిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు. నారాసుడు రాజకీయాల్లో ఉన్నంత వరకు రాష్ట్రంలో ఇలా అంశాతి సృష్టిస్తూనే ఉంటాడని ఆయన అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు నారాసుడిని అంతం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read :Hanuman Chalisa: లోక్‌సభలో హనుమాన్ చాలీసా పఠించిన మహారాష్ట్ర సీఎం కుమారుడు
ఇదిలా ఉంటే.. ఇక నుంచి ఏపీలో ఆదాయం ఆధారంగా ఆలయాల హోదా ఉంటుంద కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని ఆలయాలు అన్నింటినీ ఆన్‌లైన్ చేసి ఆడిటింగ్ చేస్తున్నట్లు, ప్రతీ దేవాలయంలో వసతికి సంబందించిన అంశాలన్నీ పరిష్కారం అయ్యాయని ఆయన తెలిపారు. అన్నవరంలో వసతికి ఎక్కువ డిమాండ్ ఏర్పడిందని.. దళారుల కారణంగా ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు మంత్రి కొట్టు. డూప్లికేట్ వసతి బుకింగ్‌లు తగ్గించేందుకే కనీసం నెలరోజుల వ్యవధిని పెట్టాల్సి వచ్చిందని వెల్లడించారు.