ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేద ఆడపిల్లల పెళ్లిళ్లకు తనవంతు సహాయంగా కానుక అందజేస్తున్న వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల ఆర్థిక సాయాన్ని రేపు ఇవ్వనున్నారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న జంటలకు ఆర్థిక సాయం అందజేయనున్నారు. దీంతో.. 18, 883 మంది జంటలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకాల కింద 141.6 కోట్ల రూపాయలను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.
Also Read : Srikalahasti Palakova : ఒక్కసారి తింటే వ్యసనమే.. 3 గంటల్లో 300 కేజీలు అమ్మకం
రేపు ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా, అలాగే.. ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. కులాంతర వివాహం చేసుకున్న వారికి రూ లక్షా 20 వేలు కానుకగా ఇస్తారు. దివ్యాంగులకు ఈ పథకం కింద రూ లక్షా యాభై వేల రూపాయలు ఇవ్వనున్నారు. అర్హతలు, దరఖాస్తు విధానాలు క్రింది విధంగా ఉంటాయి.
Also Read : Ponguleti Srinivas Reddy: తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ.. కాంగ్రెస్ ని గెలిపించి గిఫ్ట్ గా ఇవ్వాలి..