జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సర్టిఫికెట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను కోర్టు ఆయనను లోక్‌సభకు అనర్హులుగా ప్రకటించింది.
థాయ్‌లాండ్ రాజు శుక్రవారం (సెప్టెంబర్ 1) ఆ దేశ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా జైలు శిక్షను ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. నిజానికి, షినవత్రా ఇటీవలే ప్రవాసం నుంచి 15 సంవత్సరాల తర్వాత థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చారు.
మణిపూర్‌లో చెలరేగిన హింస ఇప్పటికీ ఆగే సూచనలు కనిపించడం లేదు. మరోవైపు బాక్సింగ్ స్టార్ ఎంసీ మేరీకోమ్ తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
వెనుకబడిన వర్గాలలో కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఒక లక్ష రూపాయల పంపిణీ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొన్నారు. కరీంనగర్ పద్మనాయక కళ్యాణమంటంలో 686 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు మంత్రి గంగుల. breaking news, latest news, telugu news, big news, gangula kamalakar,
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది.
ఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ 'నీట్ ఎస్ఎస్ 2023' పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. సవరించిన పరీక్ష తేదీలు త్వరలోనే బోర్డు ద్వారా వెల్లడి చేయబడతాయని పేర్కొంది.