NEET SS exam 2023: ఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ‘నీట్ ఎస్‌ఎస్ 2023’ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. సవరించిన పరీక్ష తేదీలు త్వరలోనే బోర్డు ద్వారా వెల్లడి చేయబడతాయని పేర్కొంది. ఈ వివరాలను అధికారిక NBE వెబ్‌సైట్‌లో natboard.edu.inలో యాక్సెస్ చేయవచ్చు.నీట్ ఎస్ఎస్ 2023 పరీక్ష వాస్తవానికి సెప్టెంబర్ 9, 10 తేదీల్లో షెడ్యూల్ చేయబడింది. ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10 తేదీ వరకు 18వ జీ20 సమ్మిట్ కారణంగా రీషెడ్యూల్ చేయబడ్డాయి. రీషెడ్యూల్ చేయబడిన పరీక్ష తేదీలు త్వరలోనే వెల్లడించబడతాయి.
Also Read: Yogi Adityanath: జమిలి ఎన్నికలకు యోగి మద్దతు.. మరికొందరు నేతలు ఏమన్నారంటే..?
నీట్ ఎస్ఎస్ పరీక్ష గురించి..
నీట్ ఎస్‌ఎస్ 2023 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫార్మాట్‌లో ఉంటుంది. షెడ్యూల్ చేపబడిన పరీక్ష రోజులలో ఉదయం లేదా మధ్యాహ్నం షిఫ్ట్‌లలో వివిధ సబ్జెక్ట్ గ్రూపులకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నాపత్రం మొత్తం 150 ప్రశ్నలను కలిగి ఉంటుంది, 2.5 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి.