Thailand: థాయ్ మాజీ ప్రధాని జైలు శిక్ష ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand: థాయ్‌లాండ్ రాజు శుక్రవారం (సెప్టెంబర్ 1) ఆ దేశ మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా జైలు శిక్షను ఎనిమిదేళ్ల నుంచి ఏడాదికి తగ్గించారు. నిజానికి, షినవత్రా ఇటీవలే విదేశాల్లో ప్రవాసం నుంచి 15 సంవత్సరాల తర్వాత థాయ్‌లాండ్‌కు తిరిగి వచ్చారు. ఇటీవల ప్రవాసం నుంచి తిరిగి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన మొదటి రోజే ఆయన అనారోగ్యం పాలయ్యారు. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యాల్లో దోషిగా తేలడంతో తక్సిన్‌కు సుప్రీంకోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రాకు విధించిన 8 ఏళ్ల జైలు శిక్షను థాయ్‌లాండ్ రాజు శుక్రవారం ఏడాదికి తగ్గించారు.
Also Read: Nonstick Pans : నాన్ స్టిక్ ప్యాన్స్‌లో ఈ కూరలను అస్సలు వండకండి..!
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
తక్సిన్ షినవత్రాకు సంబంధించి థాయ్‌లాండ్ రాజు మహా వజిరాలాంగ్కార్న్ తీసుకున్న ఈ నిర్ణయం శుక్రవారం రాయల్ గెజిట్‌లో ప్రచురించబడింది. దీని తర్వాత రాజు నిర్ణయం వెంటనే అమలులోకి వచ్చింది. తక్సిన్ షినవత్రా 2001 నుంచి 2006 వరకు థాయ్‌లాండ్ ప్రధానిగా ఉన్నారు. సైనిక తిరుగుబాటులో తక్సిన్ పదవీచ్యుతుడయ్యాడు. 2008లో ఆయన రాజకీయ ప్రేరేపిత ఆరోపణలపై జైలు శిక్షను ఎదుర్కొన్నప్పుడు థాయిలాండ్ నుంచి పారిపోయాడు.
తక్సిన్ షినవత్రా విదేశాల్లో 15 సంవత్సరాల పాటు ప్రవాసం తర్వాత ఆగస్టు 22న స్వదేశానికి తిరిగి వచ్చారు. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యాలకు సంబంధించిన మూడు వేర్వేరు కేసుల్లో తక్సిన్‌ను సుప్రీంకోర్టు దోషిగా నిర్ధారించింది. ఇది కాకుండా విదేశీ రుణాలు మంజూరు చేయమని ప్రభుత్వ బ్యాంకును చట్టవిరుద్ధంగా ఆదేశించడం, ఆయన నామినేట్ చేసిన వ్యక్తుల ద్వారా అక్రమంగా షేర్లు కలిగి ఉన్నట్లు కూడా ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అవినీతి ఆరోపణలపై 2008లో సైనిక తిరుగుబాటుతో థాయ్‌లాండ్ ప్రధాని పదవి నుంచి తక్సిన్ పదవీచ్యుతుడయ్యాడు. అప్పటి నుండి ఆయన దేశం వెలుపల నివసిస్తున్నాడు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో శ్వేతార్క గణపతి కల్యాణం.. భక్తులతో కిక్కిరిసిన ఎన్టీఆర్ స్టేడియం
-
Leopard Spotted : తండాలో చిరుత కలకలం.. బర్రె దూడను చంపి తినేసిన వైనం!
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..