మాజీ ఎంపీకి జీవిత ఖైదు.. డబుల్ మర్డర్ కేసులో సుప్రీం తీర్పు
1995లో జరిగిన జంట హత్యల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) ప్రభునాథ్ సింగ్‌కు శుక్రవారం సుప్రీంకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. బిహార్‌లో 28 ఏళ్ల క్రితం ఎన్నికల రోజున జరిగిన జంట హత్యల కేసులో ఆర్జేడీ (RJD) నేత, మాజీ ఎంపీ ప్రభునాథ్ సింగ్ కు శిక్ష పడింది. ఆయనకు జీవిత ఖైదు విధిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. న్యాయమూర్తులు సంజయ్ కిషన్ కౌల్, AS ఓకా మరియు విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ కేసులో మరణించిన ఇద్దరి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు మరియు గాయపడిన బాధితుడికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షలు చెల్లించాలని నిందితుడు ప్రభునాథ్ సింగ్ మరియు బీహార్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పట్నా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గత నెల కొట్టివేసింది. ఆయనను దోషిగా తేల్చిన సర్వోన్నత న్యాయస్థానం.. తాజాగా శిక్ష ఖరారు చేసింది. దీంతో పాటు మృతుల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని బిహార్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తనకు ఓటు వేయలేదన్న కోపంతో ఇద్దర్ని చంపిన కేసులో ఆర్జేడీ మాజీ ఎంపీ కి సుప్రీంకోర్టు జీవితఖైదు విధించింది. 28ఏళ్ల క్రితం జరిగిన ఈ జంట హత్యల కేసులో కోర్టు నేడు తీర్పు శుక్రవారం వెలువరించింది.
విద్యార్థిని రీతి సాహ కేసులో కొత్త ట్విస్ట్.. ఏపీ కోర్టుకు తండ్రి సుఖదేవ్
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. జులై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహ ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే, కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కేసు సంచలనంగా మారింది..
ఇక, రీతి సాహ కేసులో తాజాగా కొత్తట్విస్ట్ తెరపైకి వచ్చింది. విద్యార్థిని రీతి సాహ ఆసుపత్రిలో ఉన్న వీడియో బయటపడింది. హాస్టల్ బిల్డింగ్ నుంచి కిందపడిన తర్వాత బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చింది యాజమాన్యం. దీంతో బాలిక తల్లిదండ్రుల ఆరోపణలకు రోజు రోజుకి బలం చేకూరినట్టు అవుతుంది.. రీతి సాహా అత్మహత్య కేసులో బెంగాల్ ప్రభుత్వం ఒత్తిడితో దర్యాప్తు అధికారులపై ఇప్పటికే వేటు పడింది. సీఐ, ఎస్సైలను ఏపీ ప్రభుత్వం వీఆర్‌కు పంపింది.. మరోవైపు.. తాజాగా మరో మలుపు తీసుకుంది ఈ కేసు.. రీతి సాహ కేసుపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు ఆమె తండ్రి సుఖ దేవ్.. సీసీ టీవీ ఫుటేజ్ సేకరణ కోసం ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
“చెల్లని వివాహాల” ద్వారా పుట్టిన పిల్లలకు తల్లిదండ్రుల ఆస్తిలో వాటా ఉంటుంది..
చెల్లని వివాహాల నుంచి పుట్టిన పిల్లలకు కూడా తల్లిదండ్రుల ఆస్తిలో వాటా పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెల్లడించింది. అలాంటి పిల్లలకు చట్టబద్ధత కల్పించబడుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ వారసత్వం చట్టాల ప్రకారం మాత్రమే తల్లిదండ్రుల ఆస్తిపై హక్కులు పొందవచ్చని పేర్కొంది. చెల్లని వివాహాల ద్వారా జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రుల పూర్వీకుల ఆస్తిలో వాటా లేదా హిందూ అవిభాజ్య కుటుంబానికి చెందిన ఆస్తులపై కాపర్సనరీ హక్కు ఉందా అనే చట్టపరమైన సమస్యపై 2011 నుంచి పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై తీర్పు ఇచ్చింది. గత నెల నుంచి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై పలువురు న్యాయవాదుల వాదనలను విచారించింది.
జీ20 సమ్మిట్ కారణంగా నీట్ ఎస్ఎస్ పరీక్ష రీషెడ్యూల్
ఢిల్లీలోని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ‘నీట్ ఎస్‌ఎస్ 2023’ పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించింది. సవరించిన పరీక్ష తేదీలు త్వరలోనే బోర్డు ద్వారా వెల్లడి చేయబడతాయని పేర్కొంది. ఈ వివరాలను అధికారిక NBE వెబ్‌సైట్‌లో natboard.edu.inలో యాక్సెస్ చేయవచ్చు.నీట్ ఎస్ఎస్ 2023 పరీక్ష వాస్తవానికి సెప్టెంబర్ 9, 10 తేదీల్లో షెడ్యూల్ చేయబడింది. ఢిల్లీలో సెప్టెంబర్ 8 నుంచి 10 తేదీ వరకు 18వ జీ20 సమ్మిట్ కారణంగా రీషెడ్యూల్ చేయబడ్డాయి. రీషెడ్యూల్ చేయబడిన పరీక్ష తేదీలు త్వరలోనే వెల్లడించబడతాయి. నీట్ ఎస్‌ఎస్ 2023 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫార్మాట్‌లో ఉంటుంది. షెడ్యూల్ చేపబడిన పరీక్ష రోజులలో ఉదయం లేదా మధ్యాహ్నం షిఫ్ట్‌లలో వివిధ సబ్జెక్ట్ గ్రూపులకు సంబంధించి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నాపత్రం మొత్తం 150 ప్రశ్నలను కలిగి ఉంటుంది, 2.5 గంటల వ్యవధిలో పూర్తి చేయాలి.
ముందస్తు ఎన్నికలు జరిపితే.. మోడీ ముందే ఇంటికి పోతాడు..
దేశంలో ప్రజల దృష్టి మరల్చే రాజకీయాలు చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఘనుడని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఇవాళ (శుక్రవారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అని లీక్ ఇచ్చారని ఆయన వ్యాఖ్యనించారు. వన్ నేషన్, వన్ పార్టీ, వన్ పర్సన్.. ఆర్ఎస్ఎస్ అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌పై అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడాలని నారాయణ చెప్పారు. వన్ నేషన్ – వన్ ఎలక్షన్‌కు తాము వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం అక్కర్లేదు.. నా ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే పద్దతికాదు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ఏ ప్రక్రియ అయినా నిర్వహించాలని సీపీఐ నారాయణ అన్నారు.
షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఈసీ రిక్వెస్ట్ చేస్తున్నాం
జమిలీ ఎన్నికలపై తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు పెట్టాలని కేంద్రం ఆలోచిస్తుందని ఆయన మండిపడ్డారు. మీ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని ఎలక్షన్ కమీషన్ కు రిక్వెస్ట్ చేస్తున్నామన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రత్యేకంగా పార్లమెంట్ పెట్టేది జమిలీ ఎన్నికల బిల్ కోసమే అనుకుంటున్నాం.. మాకు అనుమానం వస్తుందని ఆయన అన్నారు. రేపు షెడ్యూల్ ఇచ్చి.. పదిహేను రోజుల్లో ఎన్నికలు అయినా మేము సిద్ధంగా ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో బిల్లు పెడతారు అనే ప్రచారం ఉందని తలసాని అన్నారు. ఏ ఎన్నికలకు అయినా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ ఓడిపోతుందనే రిపోర్ట్స్ వాళ్లకు ఉందని.. కాబట్టి అసెంబ్లీ- పార్లమెంట్ కలిపి పెడితే వాళ్లకు లాభం జరుగుతుందనే ఆలోచనతో బీజేపీ ఉందన్నారు. జమిలి ఎన్నికలు అని ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికలు జరిపించారన్నారు. జమిలి ఎన్నికలు అంటే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని తలసాని పేర్కొన్నారు. అంతేకాకుండా.. “వన్ నేషన్ వన్ ఎలక్షన్” అనే నినాదం ఇప్పటిది కాదని ఎప్పటినుంచో మోడీ ఈ దిశగా ఆలోచన చేస్తున్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. దేశంలో మోడీ క్రేజీ పడిపోయిందని పేర్కొన్నారు.
ముంబయిలో ఇండియా కూటమి కీలక నిర్ణయాలు..!
ముంబయిలో మూడో సమావేశాన్ని నిర్వహిస్తున్న ప్రతిపక్ష కూటమి ఇండియా, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన 13 మంది సభ్యులతో కూడిన కేంద్ర సమన్వయ కమిటీని ప్రకటించింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని కూటమి తీర్మానాన్ని ఆమోదించింది. సభ్య పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు వెంటనే ప్రారంభమవుతాయని పేర్కొంది.
ఇండియా కూటమి 13 మంది సభ్యుల సమన్వయ ప్యానెల్‌లో కింది వారు ఉన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎన్‌సీపి చీఫ్ శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్, ఆర్‌జేడీ నాయకుడు, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, సమాజ్‌వాదీ పార్టీ నుంచి జావేద్ ఖాన్, జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, సీపీఐ నేత డి రాజా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్ర సమన్వయ కమిటీలో ఉన్నారు. కోఆర్డినేషన్ ప్యానెల్ లీడర్‌ను ఇంకా ప్రకటించలేదు.
చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25.. కూలిన ప్రదేశం గుర్తింపు.. ఫోటోలు ఇవే.
దాదాపుగా 40 ఏళ్ల తరువాత రష్యా చంద్రుడిపైకి లూనా-25 అంతరిక్ష నౌకను పంపింది. అన్ని అనుకున్నట్లు జరిగిే చంద్రయాన్-3 కన్నా ముందే లూనా-25 చంద్రుడి దక్షిణ ధృవంపై దిగి చరిత్ర సృష్టించేది. అయితే చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత లూనా-25 రష్యాతో సంబంధాలు కోల్పోయింది. చివరకు చంద్రుడిపై కుప్పకూలింది.
సంబంధాలు తెగిపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తోంది రష్యా అంతరిక్ష సంస్థ. అయితే తాజాగా లూనా-25 కుప్పకూలిన ప్రాంతాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గుర్తించింది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేసింది. 47 ఏళ్ల తర్వాత రష్యా తొలి మూన్ మిషన్ లూనా-25 ఆగస్టు 19న విఫలమైంది. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా లూనా-25లోని ఇంజన్లు మండకపోవడం వల్లే క్రాష్ జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
తాజాగా నాసా విడుదల చేసిన ఫోటోల్లో చంద్రుడిపై దాదాపుగా 10 మీటర్ల వెడల్పుతో బిలం ఏర్పడింది. ఇది లూనా-25 కూలిపోవడం వల్లే ఏర్పడినట్లు తెలుస్తోంది. దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ కి సిద్ధమవుతున్న తరుణంలో ఈ స్పేస్ క్రాఫ్ట్ కూలిపోయింది.
రీతి సాహ కేసులో దూకుడు పెంచిన పోలీసులు
విశాఖలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇంటర్ విద్యార్థిని రీతి సాహ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది.. జులై 14వ తేదీన భవనంపై నుంచి కిందపడి రీతి సాహ ప్రాణాలు కోల్పోయింది. నీట్ శిక్షణ కోసం కోల్‌కత్తా నుంచి విశాఖ వచ్చి చదువుకుంటున్న రీతి సాహా వ్యవహారం ఇప్పుడు మిస్టరీగా మారింది. అయితే, కేసు దర్యాప్తును స్థానిక పోలీసులు తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ విద్యార్ధిని తల్లిదండ్రులు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేయడంతో అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. విద్యార్దిని ఆత్మహత్య వ్యవహారంలో ఏపీ పోలీసుల వైఖరిపై విద్యార్ధిని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేయడం, బెంగాల్ ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో కేసు సంచలనంగా మారింది..
ఆక్సిజన్ కొత్త రూపాన్ని కనుగొన్న సైంటిస్టులు.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా..?
శాస్త్రవేత్తలు ఆక్సిజన్ కొత్త రూపాన్ని ‘ఆక్సిజన్-28’ని కనుగోన్నారు. ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన దాని కన్నా ఎక్కువ న్యూట్రాన్లను కలిగి ఉంది. జపాన్ లోని టోక్యో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజికి చెందిన అణు శాస్త్రవేత్త యోసుకే కోండో నేతృత్వంలోని సైంటిస్టుల బృందం ఆక్సిజన్-28ని కనుగొంది. ఆక్సిజన్ అణువు కేంద్రకంలో ఇప్పటి వరకు చూసిన అత్యధిక సంఖ్యలో న్యూట్రాన్లు ఈ ఆక్సిజన్-28 కలిగి ఉంది. ఇది ఇప్పటి వరకు చూసిన ఆక్సిజన్ రూపాల్లో భారీదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఆక్సిజన్ -28 అనూహ్యంగా అధిక న్యూట్రాన్-టూ-ప్రోటాన్ నిష్పత్తిని కలిగి ఉంది, ఇది చాలా అరుదు. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్లు కలిగిన న్యూక్లియాన్ అనే సబ్‌అటామిక్ పార్టికల్స్ ఉన్నాయని పరిశోధకులు బృందం చెబుతోంది. ఒక మూలకం యొక్క అటామిక్ నెంబర్ ప్రోటాన్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. న్యూట్రాన్ల సంఖ్య మాత్రం మారవచ్చు. న్యూట్రాన్ల సంఖ్య ఆ మూలకం యెక్క ఐసోటోపులను ఏర్పరుస్తుంది. ఆక్సిజన్ 8 ప్రోటాన్లను కలిగి ఉంటుంది, అయితే న్యూట్రాన్ల సంఖ్య వేరుగా ఉండొచ్చు.